ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది.

ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకొనేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్ధి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా, జూబ్లీహిల్స్ ఎన్నిక పైన టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే, ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరినట్లే.. తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకోని ఆ స్థానంను దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.