TCS cuts again.. 12,000 employees out..!

సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని కంపెనీ ఆదివారం తెలిపింది. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం, AIని అమలు చేయడం వంటి కారణాల వల్ల కంపెనీ సిబ్బందికి తిరిగి శిక్షణ ఇవ్వడం, తిరిగి నియామకం చేయడం వంటివి చేస్తోంది.

ఇక విషయంలోకి వెళ్తే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఎప్పుడు ఐటీ ఉద్యోగులను ఆ కంపెనీలు తీసేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ అవసరాలకు సరిపోని, లేదా అవుట్ డేటెడ్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించేందుకు సిద్ధం అయ్యింది. టీసీఎస్ కంపెనీ రాబోయే సంవత్సరంలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ తొలగింపు కేవలం ఉద్యోగం తీసేయడమే కాదు, వా రికి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జీతం ఇచ్చి, ఆర్థిక సహాయం అందిస్తూ సాదరంగా వీడ్కోలు చెబుతోంది. ఇదే కాకుండా.. ఉద్యోగం కోల్పోయినవారు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అయ్యే జాబ్ సెర్చ్ ఏజెన్సీ ఫీజును మూడు నెలల పాటు కంపెనీయే భరిస్తోంది. మరో వైపు ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగుల కోసం TCS Cares అనే కార్యక్రమం ద్వారా థెరపీ, కౌన్సెలింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది.

తొలగింపునకు ముఖ్య కారణాలు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికత బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఫ్యూచర్‌లో మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది. UNCTAD ప్రకారం, కేవలం పదేళ్లలో ఏఐ వినియోగం 25 రెట్లు పెరుగుతుంది. TRG డేటాసెంటర్స్ రిపోర్ట్‌ ప్రకారం, ఇప్పుడు AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచ పెట్టుబడి $200 బిలియన్లకు చేరుకుంది. స్ట్రాంగ్‌ AI సిస్టమ్‌లను నిర్మించడానికి దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో అమెరికా అందరికంటే ముందుంది. ఈ లిస్టులో టాప్‌ 10 కంట్రీస్‌ వచ్చి చేరాయి. అందులో అమెరికా, UAE, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, ఇండియా, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫిన్లాండ్, జర్మనీలు ఈ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి.

ఇక ఇదే కాకుండా.. ప్రధానంగా ఏఐ సాంకేతికతల ప్రభావంతో ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఎందుకంటే ఏఐ టూల్స్ సరళమైన టాస్క్‌లను స్వయంచాలకం చేస్తున్నాయి. క్లయింట్లు 15-30% ఫీజు తగ్గింపులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. కొందరు ఉద్యోగులు రాజీనామా చేయమని బలవంతం చేయబడుతున్నారని, “ఫ్లూయిడిటీ లిస్ట్” వంటి విధానాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే, టీసీఎస్‌ మాత్రం ఇది వైపుణ్యాల అసమానతల కారణంగా జరిగినదని, AIతో సంబంధం లేదని చెబుతోంది.

కాగా ప్రపంచంలోనే ఒక సారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలను తీసివేయడం ఇదే తొలిసారి. అందులోను TCS మొదలుపెట్టిన ఈ ప్రక్రియాను.. ఐటీ సెక్టర్ ఇదే ట్రెండ్‌లు ప్రారంభమవుతాయనే సూచనగా కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. టీసీఎస్‌ తన శ్రామిక బలాన్ని 6 లక్షల నుంచి 4.5 లక్షలకు తగ్గించాలని ప్లాన్ చేస్తుందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. దీంతో సంవత్సరానికి 50 వేల ఉద్యోగాలు కోత విధిస్తారని తెలుస్తోంది. ఇది ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉద్యోగులు నూతన వైపుణ్యాలు సంపాదించాలి, కంపెనీలు ఎథికల్ ప్రాక్టీసెస్ పాటించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *