Superstar Rajinikanth's goodbye to movies..?

Kollywood : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. మరికొన్ని నెలల్లో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తలైవా తాను రిటైర్ అవుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఎక్కడ చూసినా ఆ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం జైలర్-2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్.. ఆ తర్వాత సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన ఆ మూవీ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఆ తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ తో రజినీ వర్క్ చేయనున్నారని.. అదే ఆయన చివరి మూవీ అని టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా రజినీకాంత్ రిటైర్మెంట్ పై ఒక్కసారిగా వార్తలు రావడంతో అభిమానులు మాత్రం ఇంకా షాక్ లో ఉన్నారు. తమ అభిమాన నటుడి సినిమాలు మిస్ అయిపోతామని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొన్ని మూవీలు తీస్తే బాగుణ్ణు అని అంటున్నారు. అదే సమయంలో నెటిజన్లు కూడా తలైవా రిటైర్మెంట్ పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సడెన్ గా ఇప్పుడే రిటైర్మెంట్ ఎందుకు? కమల్ మూవీనే చివరి సినిమా ఎందుకు? అన్న విషయాలపై డిస్కస్ చేస్తున్నారు. అయితే రిటైర్మెంట్ పై రజినీకాంత్ ఇప్పటికే క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికప్పుడే నిర్ణయం తీసుకోలేదని సినీ వర్గాల సమాచారం. కొన్నాళ్ల క్రితమే రిటైర్ అయ్య విషయంపై నిర్ణయించుకున్నారట.

74 ఏళ్ల వయసులో కూడా ఇంకా వరుస సినిమాలు చేసున్న రజినీకాంత్ కు విశ్రాంతి అవసరమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అభిమానుల కోసమే ఇంకా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వివిధ సినిమాల టైమ్ లో పలుమార్లు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. మళ్లీ చికిత్స అందుకుని.. తట్టుకుని యాక్టింగ్ చేస్తున్నారు. కాబట్టి వయసు పరంగా రజినీ కాంత్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదేనని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏ నటుడు అయినా.. రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు.. తన లాస్ట్ మూవీ గ్రాండ్ గా ఉండాలని కోరుకుంటారు. అందుకే కమల్ తో చేసిన మూవీ తర్వాత రిటైర్ అవ్వడం సరైనదని రజినీకాంత్ భావించినట్లు తెలుస్తోంది. రజినీ- కమల్ మల్టీస్టారర్ పై ఇప్పటికే ఆడియన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలున్నాయి. కాబట్టి ఆ చిత్రంతో తలైవా రిటైర్ అవ్వాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *