టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుంతల దేశపు యువరాణి దేవసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. అనుష్క శెట్టి నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఘాటి. తెలుగులో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇది ఒకటి అని చెప్పకనే చెప్పాలి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనుహ్యంగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఘాటి (Ghaati) ట్రైలర్ చూస్తే గంజాయి మాఫియా (Marijuana mafia) నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి (Marijuana) తోటల సాగిన ఈ ‘ఘాటి’ ట్రైలర్ ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళుతుందనిపిస్తోంది. ‘ఘాట్లలో గాటీలు ఉంటారు సార్’ అనే డైలాగ్లో ట్రైలర్ను ప్రారంభించారు. ట్రైలర్ చూస్తే అనుష్క మరోసారి అరుంధతి (Arundhati) తరహాలో రౌద్రంగా కనిపించింది. ట్రైలర్ చివర్లో ‘సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ’ అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక అనుష్క అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో తన అభిమానులలో కొత్త జోష్ నింపబోతోంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చగా, నాగవెళ్ళి విద్యాసాగర్ స్వర రచన చేశారు.
ఇక ఈ చిత్రంలో.. క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty), విక్రమ్ ప్రభు (Vikram Prabhu) జంటగా నటించిన ‘ఘాటి’ చిత్రం క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. యు.వి. క్రియేషన్స్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారు.