Star hero Vijay Thalapathy unanimously elected as Tamil Nadu TVK Party's CM candidate

ప్రముఖ తమిళ సినీ నటుడు దళపతి విజయ్ తమిళనాడు పాలిటిక్స్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో మేటి నటుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ (Vijay Thalapathy), ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, గత ఏడాది ఫిబ్రవరి 24న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK – Tamizhaga Vetri Kazhagam) పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రజల ఆశీర్వాదంతో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తాజాగా.. తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) తన తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్‌ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది.

ఇటీవలే టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు (Mahanadu) ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే మరో సారి పొత్తులపై విజయ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల వరకు బీజేపీతో (BJP) గానీ, డీఎంకే (DMK) తో గాన ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని స్పష్టం చేశారు పార్టీ అధినేత దళపతి విజయ్. తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *