శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక విషయలోకి వెళ్తే…
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కార్తిక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. రేయిలింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిసినప్పటికీ ఆలయ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఏడాది కిందట ప్రారంభించారు. 12 ఏకరాల్లో రూ. 10 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని పండా అనే ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2 వేల నుంచి 3 వేల వరకు భక్తులు మాత్రమే వచ్చేందుకు సౌకర్యం ఉంది. కానీ ఈ రోజున ఏకంగా 25 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. దీంతో సాధరణ స్థాయిలోని రెయిలింగ్ విరగడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.
కార్తీక ఏకాదశి రోజున గోవిందా నామస్మరణతో మార్మోగాల్సిన కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. తొక్కిసలాట కారణంగా ఏకంగా తొమ్మిదిమంది చనిపోయారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో అధికారులు ఒక్కసారిగా దర్శనానికి గేట్లు ఓపెన్ చేశారు. దీంతో రెయిలింగ్ విరగడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.