Varanasi : భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విజువల్స్ విడుదల అయ్యాయి. ఇప్పటివరకు ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈ భారీ చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ (Varanasi) అనే పేరు ఖరారైంది.
ఇక విషయంలోకి వెళ్తే…
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో టైటిల్ రివీల్, గ్లింప్స్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. అయితే అధికారిక లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం కాకముందే వేదిక వద్ద వీడియో అసెట్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో టైటిల్, కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి.
మహేష్ బాబు–రజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB 29కు “వారణాసి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. భారతీయ పురాతన సంస్కృతి, ఆధ్యాత్మిక నేపథ్యం, వారణాసి నగరం కథకు కేంద్రబిందువుగా ఉండటంతో ఈ టైటిల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రజమౌళి స్టైల్లో గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే పాత్రలో కనిపించనున్నాడు. ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్లో టైటిల్, మహేశ్ లుక్ రివీల్ చేయడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. టాలీవుడ్ మాత్రమే కాదు భారతీయ సినిమా ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు – ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న హైపర్ స్కేల్ అడ్వెంచర్ మూవీ SSMB 29 గురించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ చిత్రానికి “వారణాసి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. గత కొన్ని నెలలుగా టైటిల్‌పై అనేక ప్రచారాలు జరిగినా, ఫిల్మ్ యూనిట్ మాత్రం అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఆ అనుమానాలకు తెరదించుతూ “వారణాసి”నే ఫైనల్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తోన్న ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌లో ప్రదర్శించిన వీడియోలో మహేశ్‌బాబు లుక్‌తో పాటు టైటిల్‌ని కూడా రివీల్ చేశారు.