Srisailam created history.. Record-breaking floods.. Movements at the dam foundations.. Any moment..?
  • చరిత్ర సృష్టించిన శ్రీశైలం ప్రాజెక్టు..
  • గత రికార్డులు తిరగరాస్తున్న శ్రీశైలం రిజర్వాయర్..
  • నీటి విడుదలలో.. తుంగభద్ర, సాగర్ ని దాటేసిన శ్రీశైలం ప్రాజెక్టు..
  • శ్రీశైలానికి భారీ వరద క్షణం క్షణం.. భయం భయం..
  • ప్రాజెక్టు కింద ఉన్న ఆ గొయ్యిని పూడ్చేది ఎప్పుడు..?
  • డ్యామ్ పునాదుల నుంచి 120 మీటర్ల లోతైన ఏర్పడిన భారీ గొయ్యి
  • భారీ వరదల కారణంగా డ్యామ్ భద్రతపై ఆందోళన
  • ఈ సీజన్‌లో శ్రీశైలానికి చరిత్రలోనే అత్యధికంగా 2105 టీఎంసీల వరద

తెలుగు రాష్ట్రాల జీవనాడి..

శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్‌లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులు చేపట్టాలని ఈ డ్యామ్‌ పరిస్థితిని పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ రెండుసార్లు నివేదికలు ఇచ్చినా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.

ఇక విషయంలోకి వెళ్తే…

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్‌లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇంత స్థాయిలో వరద నీరు వచ్చిన దాకలాలే లేవు. అది కూడా ఎంతలా అంటే.. దాదాపు 1578 టీఎంసీల నీరు విడుదల చేసింది శ్రీశైలం ప్రాజెక్టు. ఇక తాజా సమాచారం మేరకు అంటే.. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందా అనే భయం క్షణం క్షణం భయం భయంతో గడుపుతున్నాం.

నిండు కుండలా కృష్ణ నది ప్రాజెక్టులు..

గత కొన్ని రోజులుగా.. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తెలుగురాష్ట్రాల్లో కృష్ణ నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్ని కూడా నిండు కుండలా తలపిస్తున్నాయి. కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టు ఈ సీజన్‌లో రికార్డులను తిరగరాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నీటిని స్వీకరించి, దిగువకు విడుదల చేసింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 1578 టీఎంసీల నీరు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. కృష్ణ, తుంగభద్ర, హంద్రీ వంటి నదుల నుండి రిజర్వాయర్‌కు మొత్తం 2105 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో మరో 100 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత రికార్డులు తిరగరాస్తున్న శ్రీశైలం రిజర్వాయర్..

శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతుంది. ఎగువన కృష్ణా నది పరీవాహక ప్రాంతాలలలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలానికి వచ్చిన వరద గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గతంలో 1994-95లో 2039.23 TMC లు, 2022-23లో 2039.87 TMC ల ప్రవాహం రాగా, ఈసారి ఆ రికార్డులు చెరిగిపోయాయి. ఈ సీజన్ ముగిసేలోగా మరో 100 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కృష్ణా బేసిన్ నుంచి 1,382 TMC లు, గోదావరి నుంచి 3,905 TMC ల నీరు సముద్రంలో కలిసింది. ఎగువ నుంచి ఇంత భారీ స్థాయిలో వరద వస్తుండటం శ్రీశైలం డ్యామ్ పటిష్ఠతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. డ్యామ్ దిగువన నదిలో ఏర్పడిన భారీ గొయ్యి (ప్లంజ్‌పూల్) ఈ ఆందోళనలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. గత కొంత కాలంగా.. శ్రీశైలం డ్యామ్‌‌కు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలోనే పలు నిపుణుల బృందాలు, ప్యానళ్లు, కమిటీలు డ్యామ్‌ను పరిశీలించాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కిందపడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడి. అది అంతకంతకూ పెరిగి పునాదులు బయటపడే వరకు వెళ్లింది. నేషనల్ ‌డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) శ్రీశైలం డ్యామ్ దుస్థితిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ దగ్గర నీరు భూమిని కోసుకుంటూ వెళ్లడంతో.. డ్యామ్ అడుగు భాగానికి కూడా ఆ గుంత వ్యాపిస్తుందని.. దాని వల్ల డ్యామ్ పునాదులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది..?

దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది. శ్రీశైలం డ్యామ్ స్పిల్‌వే నుంచి గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలిన సమయంలో.. ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు నేలపై పడితే గుంతలా ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కూడా అదే జరుగుతోంది. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచన సమయంలో నీళ్లు పడిన చోట భూమిపై గుంత ఏర్పడి ప్రాజెక్ట్ పునాదుల వరకు వెళుతోంది.. దానిని ప్లంజ్ పూల్ అంటారు. అలా నీళ్లు పడటంతో రివర్ బెడ్‌ను కోసేస్తోంది.. ఆ క్రమంలో గుంత పెద్దదిగగా మరుతుంది. అక్కడ గుంత చాలా లోతు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు స్పిల్‌ వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. ఇక ఈ కోతను నివారించేందుకు గతంలో ఏర్పాటు చేసిన స్టీలు సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2018 జులైలో నిర్వహించిన బాతోమెట్రిక్ సర్వేలో ఈ గొయ్యి ఏకంగా 120 మీటర్ల లోతు ఉన్నట్లు తేలింది. దీంతో 15 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదమే ఇప్పుడు పెను ముప్పుగా మారింది. అంటే 2009 అక్టోబరు 2న వచ్చిన 25.5 లక్షల క్యూసెక్కుల భారీ వరద దాదాపు 78 గంటల పాటు కొనసాగడంతో డ్యామ్ తీవ్రంగా దెబ్బతింది. అప్పుడే కట్టడం కుదుపునకు గురైందని నిపుణులు చెబుతున్నారు.

3, 10 రేడియల్‌ క్రస్టు గేట్లతో ప్రమాదం..!

ఇక ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయం 3, 10 రేడియల్‌ క్రస్టు గేట్ల నుంచి నీరు లీక్‌ అవుతోంది. అయితే గేట్లకు అమర్చిన రబ్బర్‌ సీల్స్‌ దెబ్బతినడంతో నీరు లీక్‌ అవుతోంది. ఈ విషయంపై జలవనరుల శాఖ సీఈ కబీర్‌ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం లీకేజీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ ఏడాది జలాశయానికి ముందస్తుగా వరద రావడంతో పనులకు ఆటంకం ఏర్పడిందని, త్వరలోనే రబ్బర్‌ సీల్స్‌ను మార్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో శ్రీశైలానికి మాత్రం వరదు ప్రవాహం అస్సలు తగ్గడం లేదు.. గతంలో ఎప్పుడు లేని విధంగా.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు 6 సార్లకు పైగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *