భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందా..? జల ప్రళయం భూమిని ముంచేస్తుందా..? ఈ వరుస భూ కంపాలు దేనికి సంకేతం..! ఒక వైపు వరదలు, మరో వైపు కార్చిచ్చులు, ఇంకో వైపు భూకంపాలు, సునామీలు. ఇంటీ ఈ ఉపద్రవాలు..! మహా ప్రళయం ముంచుకోస్తుందా అంటే దానికి శాస్త్రవేత్తల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది.
ప్రతీ ఏటా భూతాపం విపరీతంగా పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో భూగోళం మండిపోతోంది. ఫలితంగా వాతావరణంలో ఎన్నడూ లేని మార్పులు సంభవిస్తున్నాయి. భూతాపం కారణంగా అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతోంది. 2014-2017 సంవత్సరాల మధ్య అంటార్కిటికాలో (Antarctica) ఫ్రాన్స్ (France) దేశ వైశ్యాల్యానికి నాలుగు రెట్ల వైశాల్యంలో మంచు కరిగినట్లు నాసా శాస్త్రవేత్త క్లైర్ పార్కిన్సన్ జరిపిన అధ్యయనంలో పెర్కొంది. ఇక తాజాగా.. అమెరికాలో జరిగిన భూ కంపం తెలిసిందే. ఆ ప్రభావం అంటార్కిటికాపై తీవ్రంగా పడింది. అక్కడి మంచు ఫలకాలు కదలిపోయాయి. డ్రెక్ ప్యాసేజ్ అల్లకల్లోలానికి గురైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అమెరికాలోని చిలీలో పలు నివాసాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందింది.

ఈ భూకంపం ధాటికి 7.5 తీవ్రతతో డ్రెక్ ప్యాసేజ్ (Drake Passage) కంపించింది. దక్షిణ అమెరికా- అంటార్కిటిక్ (America-Antarctica) ద్వీపకల్పం మధ్య ఉన్న కీలక ప్రాంతం ఇది. డ్రేక్ పాసేజ్ దక్షిణ అమెరికా భూభాగానికి దగ్గరగా ఉండటం, దాని టెక్టోనిక్ ప్లేట్ల నిర్మాణం కారణంగా సునామీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వివిధ ఖండాలు, అంటార్కిటికా మధ్య గాలుల వల్ల ఏర్పడే ఫన్నెలింగ్ ప్రభావం కారణంగా ఇక్కడి సముద్ర జలాలు ఎప్పుడూ అల్లకల్లోలానికి గురవుతుంటనే ఉంటాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కో కెరటం గరిష్ఠంగా 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతుంటుంది. అలాంటి ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భూకంప కేంద్రం ఈ డ్రేక్ పాసేజ్ సముద్రతీరం పరిదిలో ఉండటం మరింత ప్రమాదకరమని భావిస్తోన్నారు. దక్షిణ అమెరికా- అంటార్కిటికా టోక్టోనిక్ ప్లేట్ల పరస్పరం సంఘర్షణ కారణంగానే ఈ డ్రేక్ పాసేజ్ ఏర్పడినట్లు సైంటిస్టులు వెల్లడించారు. దక్షిణ అమెరికా నుండి అంటార్కిటికా ప్రత్యేకంగా ఖండంగా విడిపోవడానికీ ఇలాంటి భూకంపాలే కారణమని అంచనా వేశారు. ఇక్కడి సముద్రం సగటు లోతు 15,600ల అడుగులకు పైగా ఉంటుంది. డ్రేక్ పాసేజ్ అల్లకల్లోలంగా ఉండటం వల్ల ఈ మార్గంలో నౌకల రాకపోకలు తక్కువగా ఉంటాయి. దీంతో ప్రపంచాన్ని జల ప్రళయం ముంచెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
