Another new planet in the solar system

Solar System : సౌర వ్యవస్థలో మరో కొత్త గ్రహం

ఈ శూన్య ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కంటికి కనిపించని ఖగోళ శాస్త్రంలో… టెలిస్కోప్ కు సైతం కనిపించని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటి కోసం ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తెలుసుకున్నది అణువంతైతే.. తెలుసుకోవాల్సింది సముద్రమంత ఉంది. అవును ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక, సౌర మండలాల అవతల ఉన్న గ్రహాలను గుర్తించడం చాలా కష్టం. ఇవి తమ నక్షత్రం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి వల్ల మసకబారి ఉంటాయి. అనంత విశ్వం అంతుచిక్కని రహస్యాల సమాహారం. భూమి మొదలు ఆకాశం వరకు నిగూఢమైన అనేక అంశాలను విశ్వం తనలో నిక్షిప్తం చేసుకుంది. వాటి గురించి తెలుసుకునేందుకు మానవుడు నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అనేక కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాడు.

తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలో మరో అద్భుతాని కనుగోన్నారు. సౌర వ్యవస్థ అవతల ఉన్న ఓ చిన్న మరుగుజ్జు గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సూర్యుని చుట్టూ 25,000 సంవత్సరాలకు ఒకసారి తిరిగే 2017 OF201 అనే కొత్త మరుగుజ్జు గ్రహాన్ని శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలో కనుగొన్నారు. ప్లూటో సోదర గ్రహంగా భావిస్తున్న ఈ గ్రహం దాదాపు 700 కిలోమీటర్ల వెడల్పుతో పాటు అధిక దీర్ఘవృత్తాకార కక్ష్యను కలిగి ఉంది. ఇది ఊర్ట్ మేఘం నుంచి వచ్చిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ సౌర వ్యవస్థ రహస్యం లో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఇక ఇదే కాదు ఈ భూమి మీద మానవాళి ఉన్నంత వరకు సౌర వ్యవస్థపై ఖగోళ శాస్త్రవేతలు ఏదో ఒక అన్వేషన చేస్తునే ఉంటారు.