కర్ణాటకలోని (Karnataka) ధర్మస్థలలో (Dharmasthala) మిస్టరీ హత్యలు (Mystery Murders) జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సిట్ (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 1998-2014 వరకు వందలాది మంది మహిళలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చివేశారని మాజీ శానిటేషన్ ఉద్యోగి ఇటీవల ఫిర్యాదు చేశాడు. తన చేత బలవంతంగా ఆ పని చేయించారన్నాడు. అందుకు సాక్ష్యంగా ఓ అస్థిపంజరాన్ని PSకు తీసుకెళ్లాడు. కాగా అమ్మాయిలు, మహిళలను రేప్ చేసి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : Operation Mahadev : ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్..! పహల్గాం ఉగ్రవాదులు ఎన్ కౌంటర్…
తాజాగా ఆ మాజీ శానిటేషన్ ఆ వందలాది శవాలకు సంబంధించిన 15 శవాల ప్రాంతాలను గుర్తించాడు. నేత్రావతి నది (Netravati River) ఒడ్డున, హైవేకు పక్కన వీటిని కనుగొన్నారు. 1998 నుంచి 2014 మధ్య వందలాది శవాలను పూడ్చిపెట్టాడని దాదాపు నిర్ధారణ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాక, ప్రజల్లో విపరితంగా భయం పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ 15 మృతదేహాలు కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడం, మృతదేహాల ఆవశేషాల విశ్లేషణ, DNA పరీక్షలు చేసేందుకు సిద్దమయ్యారు.
Also Read : UPI Rules : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కొత్త రూల్స్
కాగా ‘2010లో పూడ్చిపెట్టిన ఓ బాలిక మృతదేహంపై స్కూల్ యూనిఫాం కేసుతో ఈ భయనకమైన కేసు బహిర్గతం అయ్యింది. ఆ బాలికతోనే బాడిని చూసి అతనికి అనుమానం వచ్చింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఆ శానిటేజర్ నిర్ధారించాడు. దీంతో సిట్ ముందు.. స్కూల్ బ్యాగ్‌తో పాటే ఆమెను కూడా పూడ్చిపెట్టాలని నాతో సూపర్‌వైజర్లు చెప్పారు. ఇక, 20 ఏండ్ల వయసున్న మరో యువతిని రేప్ చేసి చంపేసినట్టు గమనించా.. ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. ఆమె ఆనవాళ్లు దొరకవద్దని ఆమెకు సంబంధించిన చెప్పులు, ఇతర వస్తువులను అన్నింటినీ డెడ్‌బాడీతో పాటే పూడ్చేయమన్నారు. ఈ రెండు కేసులే.. దర్మస్థలి లో తీవ్ర సంచలనంగా మారాయి.