Shashi Tharoor suspended from Congress?

గత కొంత కాలంగా జాతీయ కాంగ్రెస్ (National Congress) పార్టీలో శశిథరూర్ (Shashi Tharoor) కి అక్కడి నేతలకు పడటం లేదాటా. ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో (National Congress Party) సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా..? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్‌ (MP Shashi Tharoor) కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. శశిథరూర్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

  • ఉప రాష్ట్రపతి రేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్..?
  • శశిథరూర్ పై జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం తో ఉందా..?
  • శశిథరూర్ పై కాంగ్రెస్ పార్టీ వేటుకు రంగం సిద్ధం చేసుకుందా..?
  • గత కొంత కాలంగా కాంగ్రెస్ కు శశిథరూర్ మధ్య విభేదాలు మొదలయ్యాయా..?
  • శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా..? లేకా పార్టీ బహిష్కరిస్తుందా..?
  • రాహుల్ కి శశిథరూర్ కి ఎక్కడ చెడింది..?
  • కాంగ్రెస్ పార్టీలో నిజంగా శశిథరూర్ కి అసంతృప్తి ఉందా..?
  • పహల్గాం దాడి తర్వాత భారత్ సాహసాన్ని మెచ్చుకున్న శశిథరూర్

కాంగ్రెస్ లో ముసలం..

గత కొంత కాలంగా జాతీయ కాంగ్రెస్ (National Congress) పార్టీలో శశిథరూర్ (Shashi Tharoor) కి అక్కడి నేతలకు పడటం లేదాటా. ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో (National Congress Party) సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా..? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్‌ (MP Shashi Tharoor) కు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. శశిథరూర్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

శశిథరూర్ మావాడు కాదు..

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం నుండి నాలుగు సార్లు ఎంపీగా గెలిచినా థరూర్ అమెరికా పర్యటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే కేరళలోనే లెఫ్ట్ ప్రభుత్వ పాలసీలను పొగిడాడు. పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమే అని, ఏ విషయంలో అయినా దేశమే ముందుగుగా ఉండాలని అన్నారు. ఇటీవల కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ భద్రత దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఒకదానితో మరొకటి సహకరించుకోవాలని ఆయన చెప్పారు.

ఇకపై థరూర్ మాలో ఒకరు కాదు అంటూ మురళీధరన్ (Muralitharan) చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం పెట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలకు బలం చేకూరుతోంది. ఈ వ్యాఖ్యలకు కారణం.. శశిథరూర్ మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ.. సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. శశిథరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నామని, అందుకే ఆయనను తిరువనంతపురంలో తాము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు పిలవకూడదని నిర్ణయించుకున్నామని మురళీధరన్ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్ ఇకపై మాలో ఒకరు కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని మురళీధరన్ పేర్కొనడం గమనార్హం.

కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నాయా..?

శశిథరూర్ కి కాంగ్రెస్ (Congress) తో విభేధాలు ఉన్నాయన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై శశి థరూర్ స్పందిస్తూ గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నాయని కానీ వాటిని అంతర్గతంగా చర్చించుకుంటానని చెప్పారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలను కూడా నమ్ముతానని థరూర్ చెప్పారు. థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ మురళీధరన్ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

నాకు దేశ భవిష్యత్తే ముఖ్యం..!

దేశ సేవ చేయటంలో ఎల్లపుడూ ముందు ఉంటానని, దేశానికి ఏదైనా సమస్య తలెత్తినపుడు.. దేశం కోసం నిలబడాలని, ఆ సమయంలో ఏ పార్టీ అనేది చూడరాదు అని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో దేశ ప్రధానిని, ఎప్పటికప్పుడు ప్రధాని తీసుకునే నిర్ణయాలని శశి థరూర్ ప్రశంసిస్తున్నారు. దీంతో థరూర్ కాంగ్రెస్ ని వీడి బీజేపీ (BJP) లోకి వెళ్తారని ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

బీజేపీతో సాన్నిహిత్యం ఉందా..?

ఇటీవలే కాశ్మీర్ లోని పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్ర దాడికి.. భారత్ చెపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur), దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ప్రధాన మంత్రి మోదీకి మద్దతు ఇవ్వడంపై తాను ఎదుర్కొన్న విమర్శలను ప్రస్తావించారు. మన సాయుధ దళాలకు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తాను తీసుకున్న వైఖరిపై చాలామంది తనను విమర్శించారని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా పార్టీ లక్ష్యం సొంత మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేనని అన్నారు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా రాజకీయాల్లో పోటీ అనివార్యంగా ఉంటుందని, కానీ క్లిష్టమైన సమయాల్లో కలిసి పనిచేయడానికి అది అడ్డురాకూడదని ఆయన అన్నారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *