గత కొంత కాలంగా.. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు ఫొటోలు తీసుకోవాలంటే కెమెరానే వాడేవారు. ప్రస్తుతం అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో మనకిష్టం వచ్చినప్పుడు, ఇష్ఠారితిలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఈమధ్య కాలంలో సెల్ఫీలు తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ సంచలన రిపోర్టు వచ్చింది.

ఇక విషయంలోకి వెళ్తే.. ప్రపంచ వ్యాప్తంగా సెల్పీ మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొండ ప్రాంతాలు, హిమాలయపు పర్వతాలు, ఎత్తైన భవంతులు, రూఫ్ టాపులు, జలపాతాలు, నదులు, బీచ్ లు ఇలా అన్ని ప్రంతాల్లో సెల్ఫీ మరణాలు విపరితంగా చోటు చేసుకుంటున్నాయి. క్షణకాల సెల్ఫీకి ప్రాణాలమీదు తెచ్చుకుంటున్నారు. దీంతో సెల్ఫీ మరణాల్లో భారత దేశం అగ్ర స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో దాదాపు 46 శాతం మంది సెల్ఫీ తీసుకోని మరణించారు. మొదటి స్థానంలో.. భారత్ ఉంటే రెండోవ స్థానంలో.. అమెరికా మూడో స్థానంలో రష్యా దేశాలు నిలిచాయి. నాలుగో స్థానంలో పాకిస్థాన్, ఐదోవ స్థానంలో ఆస్ట్రేలియా, ఆరోస్థానంలో ఇండోనేషియా ఆ తర్వాత కెన్యా, యూకే, స్పెయిన్, బ్రెజిల్‌లోని ఒక్కో దేశంలో 13 మంది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సెల్ఫీ ప్రమాదంలో మొత్తం 271 ప్రమాదాలు సంభవించగా అందులో 214 మంది చనిపోయారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడ్డారు.
