రాజస్థాన్ (Rajasthan) లోని ఘజావర్ (Gajawar)అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు.
ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని ఘజావర్ అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ పై కప్పు (school accident) ఒక్క సారిగా కూలిపోయింది. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరగడంతో.. దాదాపు ఐదుగురు విద్యార్ధులు (Child Death) అక్కడికక్కడే మృతి చెందారు.
శిథిలాల కింద నలభై మంది పిల్లలు..
ఝలావర్ జిల్లాలోని మనోహర్ థానేలో ఉన్న పిప్ లోడీ గవర్నమెంట్ స్కూల్లో (Government School) ఉదయం 8.30 సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూలు కూలిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఇది జరిగిన సమయంలో అక్కడ 40 మంది పిల్లలతో పాటూ టీచర్లు కూడా మరికొంతమంది ఉన్నారు. గ్రామస్తులే శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు అందరూ చనిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ ఎప్పటి నుంచో శిథిలావస్థలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. కూలిన భవనం కింద 8 వరకు చదివే పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది జేసీబీతో శిథిలాలను తొలగిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.