Sameera Fatima, who married 8 times in 15 years in Maharashtra

Woman 8 Married 8 Men : సాధారణంగా.. టీచర్ అంటే ఎలా ఉండాలి. విద్యాబుద్ధులు, జీవిత పాఠాలు, జీవిత సత్యాలు చెప్పాలి. కానీ కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం విద్యాబుద్ధులు చెప్పాల్సిన పోయి.. పనికిరాని పనులు పని గట్టుకోని చేస్తున్నారు. గతంలో మనం.. నిత్య పెళ్లి కొడుకు గురించి చాలా సార్లు విన్నాం. అలాంటి చాలా ఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను ఎన్నో చూశాం. కానీ అమ్మాయిలు కూడా.. ఈ తరహాలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఎప్పుడు అబ్బాయిలేనా.. మాకు సాధ్యం కాదా అన్నట్లుగా.. ఆడవాళ్లు కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మరి ఏం మోసం చేసింది. ఆ టీచర్.. ఏం చీటింగ్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందా రండి.

ఇక విషయంలోకి వెళ్తే..

మహారాష్ట్రలో ఓ నిత్య పెళ్లి కుమార్తె కేసు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో.. ఓ మహిళ 15 యేళ్లలో ఎనిమిది మందిని పెళ్లాడింది. ఇంకా ఎంత తక్కువ అని అనుకుందేమో.. మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిత్య పెళ్లి కూతిరుని కటకటలోకి పంపించారు.

ఈ కేసు తాలుకు విషయాలు ఒక సారి పరిశీలిస్తే.. ఓ లేడి ఎనిమిది మందిని వివాహం చేసుకుంది. అలా భర్తలను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లను బెదిరించి దోచుకోవడం మొదలు పెట్టింది. తాజాగా తొమ్మిదో వివాహానికి ఆమె ప్రయత్నిస్తు అడ్డంగా దొరికిపోయింది. అలా ఆమె చేతిలో మోసపోయిన.. మాజీ భర్తల ఫిర్యాదు నేపథ్యంలో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వరుస పెళ్లిళ్లతో.. మహారాష్ట్రలో సమీరా ఫాతిమా ‘దోపిడీ దుల్హాన్’ గా పేరుపొందింది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో నమోదైన ముస్లిం వర్గానికి చెందిన ధనవంతులు, వివాహిత పురుషులను లక్ష్యంగా చేసుకున్నది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా పరిచయం పెంచుకున్నది. తన దీన పరిస్థితిని వివరించి వారి నుంచి సానుభూతి పొందేది. అల వల వేసి మరి పెళ్లిళు చేసుకుంటు వస్తుంది. ఇప్పటికే.. సమీరా ఫాతిమా 8 మందిని వివాహం చేసుకుంది. తర్వాత తన ముఠాతో కలిసి బెదిరించి బ్లాక్‌మెయిల్‌ చేసి లక్షల్లో డబ్బులు దోచుకున్నది. ఒక భర్త నుంచి రూ.50 లక్షలు, మరొక భర్త నుంచి రూ.15 లక్షలు వసూలు చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌కు చెందిన సీనియర్ అధికారిరి కూడా మహిళ చేతిలో మోసపోయిన బాధితుల జాబితాలో ఉన్నారు. గతంలో తమిళనాడులో దాదాపు 50 పెళ్లలు చేసుకున్న కిలేడీ ఘటన చూశాం.

భర్తల పిర్యాధు మేరకు.. జులై 29వ తేదీన నాగపూర్‌లోని ఒక టీ షాప్‌ వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు వెళ్లి మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *