Delhi excise policy case : ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి భారీ ఊరట..!
Delhi excise policy case : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది. ఈ కేసులో కవితకు పూర్తిస్థాయిలో క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు పేర్కొంది. కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కోర్టు కేసులు కొట్టివేసింది. వాళ్లందరి పేర్లు డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా ఈ కేసులో వాళ్ల పేర్లు ఇరికించినట్లు మండిపడింది. మొత్తంగా ఈ కేసులో అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఇక విషయంలోకి వెళ్తే..
జాతీయ స్థాయి నుంచి సౌత్ ఇండియాలో కూడా ఢిల్లీ లిక్కర్ స్మామ్ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. గత రెండేళ్లుగా ఈ కేసుపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ బహిష్కరణ నేత మాజీ ఎంపీ కవిత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియా బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చారు. తాజాగా కోర్టు వారిపై ఉన్న కేసు కొట్టివేయడంతో వాళ్ల అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసుపై ఇక తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీపై సీబీఐ (CBI) నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఇచ్చింది. ఆమెపై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తిస్థాయిలో క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
కవిత అరెస్ట్..!
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Case) కేసులో 2024 మార్చి 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులచే అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతఏప్రిల్ 11న CBI కూడా ఆమెను అరెస్ట్ చేసింది. సుమారు 5 నెలల పాటు తీహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆగస్టు 2024 చివర్లో విడుదలయ్యారు.
20 మందిపై ఎత్తివేసిన కోర్టు..!
ఇక ఈ కేసులో కవితతో పాటు నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుబ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయవాది జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సీబీఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. రెండేళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇవాళ కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో కవితకు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించింది.
2022 లో కొత్త లిక్కర్ పాలసీ..!
ఇక 2021, నవంబర్ 17న అప్పటి ఢిల్లీ ఆప్ ప్రభుత్వం కొత్తగా లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో 2022 సెప్టెంబర్‌లో ఈ పాలసీని రద్దు చేసింది. ఇందులో ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీలో సవరణలు చేసేటప్పుడు వీళ్ల అక్రమాలకు పాల్పడ్డట్లు ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. లైసెన్స్ కావాలనుకునే వారినుంచి అక్రమంగా నగదు తీసుకున్నట్లు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తు కోసం కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుండి తొమ్మిది సమన్లు పంపించారు.