RK Roja arrested…? 40 crore scam..?

ఆటలో అవినీతా..!?

  • ఏపీలో కొనసాగనున్న అరెస్టుల పర్వం..?
  • త్వరలో వైసీపీ మాజీ మంత్రి రోజా అరెస్ట్..?
  • మొన్న వంశీ.. నిన్న మిథున్ రెడ్డి.. నేడు రోజా..
  • మంగళగిరి దాడిలో వంశీ అరెస్టు..
  • లిక్కర్ స్కాం లో మిథున్ రెడ్డి..
  • ఆడుదాం ఆంధ్ర స్కాం లో రోజా అరెస్ట్ కాబోతుందా..?
  • రేపు రోజా, బైరెడ్డి జైలుకు వెళ్లాల్సిందేనా..?
  • నిజంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అంతులేని అవినీతి జరిగిందా..?
  • రోజా, బైరెడ్డి పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నారు..?
  • ఈడీ, విజిలెన్స్ ఏం తేల్చాయి..?
  • అసలేం జరగోబోతుంది..

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ (YCP) హయాంలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం (A coalition government) విచారణ చేయిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు నాటి నటి.. నేడు మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధం అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆడుదాం ఆంధ్రలో (adudam andhra)అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఒక్క సారిగా ఆటలో అక్రమాలు చేసి కోట్లల్లో స్కాం జరిగినట్లు గుర్తించారు విజిలెన్స్. దీంతో ఆర్కే రోజా అరెస్ట్ అంటూ మీడియా మొత్తం కోడై కూస్తుంది. ఇందులో మాజీ మంత్రి రోజా.. అమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి (byreddy siddharth reddy) పాత్ర పైన ఆరోపణలు ఉన్నాయి.

ఇక విషయంలోకి వెళ్తే..

అంతా ఆ ఇద్దరే చేశారు..?

ప్రస్తుతం ఆంధ్రాలో ఏం జరుగుతుంది అంటే.. గత పాలనలో ప్రభుత్వాన్ని చేతుల్లో పెట్టుకోని పాలనను అక్రమాలకు పాల్పడ్డ నేతలను కూటమి ప్రభుత్వం వెంటాడి వెంటాడి అరెస్టులు చేస్తుంది. ఒక్కొక్క శాఖ ఓపెన్ చేస్తూ.. అక్రమార్కుల బరతం పడుతుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కన్న ఆడుదాం ఆంధ్రా స్కాం (adudam andhra scam) పై పడింది. దీంతో ఆ శాఖకు బాధ్యత వహించిన స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి ఆర్కే రోజా చిట్టాను ఏపీ ప్రభుత్వం బయటకు లాగుతుంది. కాగా ఆడుదాం ఆంధ్రా లో అక్రమాలు జరిగినట్లు అందులో ముఖ్యంగా ఆ ఇద్దరి పాత్ర అంటే.. మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆమె సోదరుడితో పాటుగా శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పై ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో ఆడుదాం ఆంధ్రా స్కామ్ పై విజిలెన్స్ విచారణ పూర్తి చేసింది.

రూ. 40 నుంచి 65 కోట్లు స్కాం..?

వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట వందల కోట్లు ఖర్చు చేసారు అని.. గతంలో ‘ఆడుదాం ఆంధ్రా’కు రూ.125 కోట్లును ప్రభుత్వం కేటాయించగా.. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లుగా విజిలెన్స్ (Vigilance) తేల్చినట్లు సమాచారం. అదే విధంగా విజేతలుగా వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇక.. కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా విచారణ లో ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. అదే కాకుండా.. విజిలెన్స్‌ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయించి.. మరో రూ. పది వేలు జేబులో వేసుకుని.. ఖర్చు రూ. 20 వేలు చూపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 2023 డిసెంబర్‌లో ప్రారంభమైన ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్‌ స్టికర్లను భారీగా అంటించారు. దీంతో ఈ ప్రక్రియను నిధుల దుర్వినియోగం కింద పరిగణించారు విజిలెన్స్ అధికారు. కాగా ఈ ఈరోజు ప్రభుత్వానికి ఓ నివేధిక ఇచ్చింది. దాదాపు ఈ కార్యక్రమం నుంచి రూ. 40 నుంచి 65 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. మరో వైపు క్రీడా పరికరాల నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిపోయిన క్రీడా కిట్లు ఏమయ్యాయనేదానిపై విచారణ జరుగుతంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి… విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ షర్టులు పంపిణీ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం దాదాపు 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయ్‌. కాగా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తులో మాత్రం.. దాదాపు రూ. 40 కోట్లకు పైగా నగదు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు.

క్రిమినల్ కేసులు తప్పవా..?

దీంతో ఈ ఇద్దరి నేతలు నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే గత ప్రభుత్వపు అధికారులు స్కాం కు తాలుకు వివరాలను డిలీట్‌ చేశారని విజిలెన్స్‌ తన నివేదికలో తెలిపినట్టు సమాచారం. దీంతో వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా అరెస్ట్‌ దాదాపు ఖాయం అన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం వీరి పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఇక కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. ఆడుదాం ఆంధ్ర ఆటగాళ్ల కు బేడీలు పడక తప్పదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *