Retirement of international star cricketers

Cricketer Retirement : క్రికెట్ ఫ్యాన్స్ కి హాట్ బ్రేకింగ్ న్యూస్… ఇద్దరు స్టార్ క్రికెటర్స్ రిటైర్మెంట్

క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఒకే సారి ఇద్దరు మరో స్టార్ క్రికెటర్స్ రిటైర్ మెంట్ (Cricketer retirement). నిజంగా… క్రికెట్ అభిమానులకు గుడె పగిలిపోయే వార్తా అనే చెప్పాలి. ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

క్రికెట్ ఫ్యాన్స్ కి గుండె పగిలే వార్త…

తాజాగా తన రిటైర్మెంట్ (Retirement) ని స్వయంగా ఆయనే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. దేశానికి ప్రాతినిథ్యం వ‌హించాల‌నేది నా చిన్న‌నాటి క‌ల‌. ఆ అవ‌కాశం ల‌భించ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రోటీస్ తరపున ఆడటం వల్ల నా జీవితాన్ని మార్చిన గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం లభించింది. గొప్ప స్నేహాలు పొందాను. నాకు స‌హ‌క‌రించిన కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, కోచ్‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. నా ఛాతీపై ప్రోటీస్ బ్యాడ్జ్‌తో ఆడటం నా కెరీర్‌లో అతిపెద్ద గౌరవం గా భావిస్తున్నాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఈ నిర్ణయం నాకు అలా చేయడానికి వీలు కల్పిస్తుంది. ‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ప్రకటించడం నాకు చాలా బాధాకరం. భవిష్యత్తులో నాకు, నా కుటుంబానికి ఏది మంచిదో నిర్ణయించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇది నిజంగా చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఎంతో ప్ర‌శాంత‌త ల‌భిస్తుందని… అని హెన్రిచ్ క్లాసెన్ రాసుకొచ్చాడు.

నాలుగు టెస్టులు… 60 వ‌న్డేలు…

ఇక 2018లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (International Cricketer) అరంగ్రేటం చేసిన హెన్రిచ్ క్లాసెన్.. ద‌క్షిణాఫ్రికా త‌రుపున నాలుగు టెస్టులు, 60 వ‌న్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 60 వ‌న్డేల్లో 43.7 స‌గ‌టుతో 2141 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు ఉన్నాయి. 58 టీ20ల్లో 23.2 స‌గ‌టుతో వెయ్యి ప‌రుగులు చేశాడు. 4 టెస్టుల్లో 13 స‌గటుతో 104 ప‌రుగులు చేశాడు.

2024 జ‌న‌వ‌రిలో అత‌ను టెస్టు క్రికెట్ (Crickete) నుంచి రిటైర్ అయ్యాడు. ద‌క్షిణాఫ్రికా (South Africa) త‌ర‌పున నాలుగు టెస్టులు, 60 వ‌న్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు అత‌ను ఆడాడు. టీ20 క్రికెట్‌లో క్లాసెన్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టీ20 (T20) కెరీర్‌ను పొడిగించాల‌ని అత‌ను నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ (IPL) లో అత‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. ఇక మేజ‌ర్ లీగ్ క్రికెట్ టోర్నీలో సియాటెల్ ఆర్కాస్ త‌ర‌పున‌ఆడేందుకు అత‌ను కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ద హండ్రెడ్ టోర్నీలో అత‌ను మాంచెస్ట‌ర్ ఒరిజిన‌ల్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.

మాక్స్‌వెల్…

హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఆస్ట్రేలియా (Australia) స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్‌వెల్ చివరిగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఇందులో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌లో ఓడిపోయింది. 149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్ 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో తాను మాట్లాడానని, 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తాను ఆడబోనని చెప్పానని మాక్స్‌వెల్ చెప్పాడు.

Suresh