Putin's body double

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం.. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్- వ్లాదిమిర్ పుతిన్ భేటీ. తెలుగులో సలార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రాణా స్నేహితులు.. భర్గ శత్రువుల ఎలా అయ్యారు అని. అచ్చం అలాగే భర్గ శత్రువులు.. మిత్రులుగా ఎలా అయ్యారు. అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అదేవరో కాదు ప్రపంచ పెద్దన్న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా, రష్యా దేశాలకు ఒకటి అంటే ఒకటి అస్సలు పడదు. ఈ రెండు దేశాలు భేటీ జరిగిన కొన్ని ఏండ్లు అవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ – రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటి అంతా పక్కన పేడితే.. అసలు ఈ పుతిన్ ట్రంప్ తో భేటి అయ్యారా.. లేక ఆయన ఫేక్ బాడీ భేటి అయ్యిందా అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ఇక విషయంలోకి వెళ్తే..

గత పదేళ్ల కాలంలో పుతిన్ అమెరికాకు రావడం ఇదే మొదటిసారి. 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి హాజరయ్యారు పుతిన్. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ అలస్కాలో అడుగు పెట్టారు. ఈ పాయింటే.. ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. అలస్కాకు వచ్చింది నిజంగా పుతినేనా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా అన్నా, డొనాల్డ్ ట్రంప్ అన్నా పుతిన్ పెద్దగా ఇష్టపడడని వ్యక్తి ఇప్పుడు ఏకంగా అలస్కాకు రావడం ప్రపంచానికే ఆశర్యాన్ని కి గురిచేస్తుంది.

ఫేక్ పుతిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రంప్ – పుతిన్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అలస్కాలో ట్రంప్ తో సమావేశమైంది వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన బాడీ డబుల్ అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్లు- వారిద్దరి మధ్య జరిగిన చర్చల కంటే కూడా పుతిన్ బాడీ డబుల్ విషయంపైనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇక్కడ.. ట్రంప్ – పుతిన్ మధ్య ఏం జరిగింది.. వాళ్లు ఏ అంశంపై చర్చలు జరిపారు.. ఉక్రెయిన్ – రష్యా యుద్దంపై ట్రంప్ ఎలాంటి సందేశాలు పుతిన్ కి వివరించారు అనే దానిపై చర్యలు జరగాలి. కానీ.. ఇక్కడ ఆ ప్రశ్నలు తావు లేదన్నట్లుగా.. పుతిన్ బాడీ డబుల్ పైనే ఎక్కువ ఫోకస్ పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా.. ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీంతో దీనిపై.. గల కారణాలను ఎవరికి వారు విశ్లేషించుకుంటోన్నారు. బుర్రలకు పదును పెట్టారు. తమ తమ వాదనలకు మరింత బలాన్నిచ్చేలా పుతిన్- ఆయన బాడీ డబుల్ మధ్య గల పోలికలను వెలికి తీస్తోన్నారు. ఈ పరిణామాలన్నింటిపై లండన్ కు చెందిన వెబ్ సైట్ డెయిలీ స్టార్ ఓ ప్రత్యేక కథనాన్ని ఎక్స్ క్లూజివ్ గా ప్రచురించింది. ఈ కథనం ప్రకారం- ట్రంప్‌ను కలిసింది అసలు వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన ట్రేడ్ మార్క్ అయిన ‘గన్‌ స్లింగర్ వాక్’ లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ను కలిసింది ‘పుతిన్ బాడీ డబుల్’ అని చాలా మంది నెటిజన్లు వాదిస్తోన్నారు. కొందరు అయితే చీపెస్ట్ బాడీ డబుల్ గా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడున్నది ఖచ్చితంగా బాడీ డబుల్. అసలు పుతిన్ బహుశా అలస్కాలోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు.. అని ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లేదంటే అసలు పుతిన్ అలస్కాకు రాకపోయి ఉండవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు.

పుతిన్ బాడీ డబుల్..

పుతిన్ తన అయిదో బాడీ డబుల్ ను ఈ భేటీకి పంపించాడని తేల్చి చెప్పారు. అతను పుతిన్ లా లేడు. అతడి చెంపలు నునుపుగా ఉన్నాయి. నిజానికి పుతిన్ ముఖం అంత నునుపుగా ఉండదు. అతని కుడి చేయి కదలట్లేదు. ఇది క్లాసిక్ KGB వాక్..అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఈ బాడీ డబుల్‌ను వాదనలకు పేరు కూడా పెట్టారు నెటిజన్లు. ‘జోవియల్ పుతిన్’ వచ్చాడని, కావాలంటే హెయిర్‌ లైన్, చెంపలు, చిరునవ్వు, హావభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఓ యూజర్ చెప్పాడు. చెక్కిళ్లు చాలా లావుగా ఉన్నాయి. పుతిన్ కంటే ఎక్కువ చలాకీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలకు పుతిన్.. తన బాడీ డబుల్‌ను పంపుతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉండటం కూడా తాజా అనుమానాలకు తెర తీసినట్టయింది. పుతిన్ గురించి గతంలో నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ న్యూరాలజీ ప్రొఫెసర్ బాస్టియాన్ బ్లోమ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తోన్నారు.

పుతిన్ తరచుగా తన కుడి చేతిని దృఢంగా ఉంచి, ఎడమ చేతిని స్వేచ్ఛగా అటూ ఇటూ ఊపుతూ నడుస్తారని, దీనికి గల కారణం- పార్కిన్సన్ లేదా స్ట్రోక్ వంటివి కారణం అయి ఉండొచ్చని గతంలో న్యూరాలజీ ప్రొఫెసర్ బాస్టియాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తూ బాడీ డబుల్ వాదనలకు కారణాలను చూపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *