Pushpa 2 in the Oscar race, coming to Sankranthi, Kannappa..!

2026 ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ ఇండియా భారత దేశం తరుపున వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో టాలీవుడ్ నుంచి కన్నప్ప, గాంధీ తాత చెట్టు, సంక్రాంతికి వస్తున్నాము, పుష్ప 2, కుబేర చిత్రాలు ఉన్నాయి.

2026 ఆస్కార్ అవార్డు(Oscar Awards 2026)ల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ ఇండియా(Film Federation Of India) భారత దేశం తరుపున వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో టాలీవుడ్ నుంచి కన్నప్ప, గాంధీ తాత చెట్టు, సంక్రాంతికి వస్తున్నాము, పుష్ప 2, కుబేర చిత్రాలు ఉండగా.. బాలీవుడ్ నుంచి , ‘ది బెంగాల్ ఫైల్స్’, ‘కేసరి చాప్టర్ 2’, హోమ్ బౌండ్, తదితర చిత్రాలు ఉన్నాయి. మొత్తం 24 సినిమాలు ఆస్కార్ 2025 నామినేషన్ కోసం పోటీ పడగా.. వాటిలో నుంచి ‘హోమ్ బౌండ్’ సినిమా ఎంపికైంది. ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఈ చిత్రాన్ని నామినేట్ చేశారు. దీంతో భారత దేశం నుంచి ‘హోమ్ బౌండ్’ ఆస్కార్ బరిలో పోటీ పడనుంది. సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, కుబేర చిత్రాలు ఆస్కార్ నామినేషన్ మిస్సవ్వడం ప్రేక్షకులను నిరాశ పరిచింది.

ఆస్కార్ రేస్ లో హోమ్ బౌండ్..

అయితే ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఆస్కార్ గెలుచుకోలేదు. మరి ఇప్పుడు హోమ్ బౌండ్ చిత్రానికి ఆ అదృష్టం దక్కుతుందా? చూడాలి. గతంలో మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే!’, ‘లగాన్’ చిత్రాలు కూడా ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో నామినేషన్స్ పొందాయి. కానీ, ఆస్కార్ అందుకోలేకపోయాయి. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’, ‘RRR’ చిత్రాలు ‘ఉత్తమ పాట’, ‘ఉత్తమ సంగీతం’ వంటి ఇతర విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి.

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ లెజెండ్ మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 26న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. విడుదలకు ముందే 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది. జాన్వీ కపూర్, ఇషాన్‌ ఖట్టర్, విశాల్‌ జెత్వా ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *