Prakash Raj as Mahesh's father in Varanasi..? Video goes viral..

Prakash Raj : వారణాసి లో మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్..? వీడియో వైరల్‌..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్‌ మూవీ వారణాసి. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా .. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక బాక్సాఫీస్ లోకి వెళ్తే…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్‌ మూవీ వారణాసి. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా .. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇంతకు ఇందులో ఆయన పాత్ర ఏంటి అన్నది క్లారిటీ లేదు. మహేష్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తన పాత్రపై వివరణ ఇచ్చారు. వారణాసి చిత్రంలో తాను శివుడి భక్తుడిగా నటిస్తున్నానని తెలిపారు. తనలోని నటుడి ఆకలిని వారణాసి చిత్రం తీర్చిందంటూ ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో మహేశ్‌తో పాటు ఇతర నటినటులపై కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ సినిమాను దర్శక దీరుడు రాజమౌళి ట్రూ ఐమాక్స్ ఫార్మాట్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, రామాయణ ఎపిసోడ్ స్క్రీన్ పై అద్భుతంగా ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం 50% పైగా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే అడ్వెంచరస్ పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌లో త్రిశూలం పట్టుకుని, తెల్లటి ఎద్దుపై వచ్చే మహేష్ లుక్ తెగ వైరల్ అయ్యింది. ఇందులో ఆయన రామాయణ నేపథ్యమున్న సీక్వెన్స్‌లో రాముడిగా కూడా కనిపించబోతున్నారు.

వారణాసి స్క్రిప్ట్ లీక్ చేసిన ప్రకాష్ రాజ్

అయితే ఇక్కడే అసలు లీక్ లీక్ అయ్యింది మరి. మూవీలో సాహస అన్వేషకుడు ‘రుద్ర’గా పవర్ ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో ఆయన లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆయనే ఓ పవర్ అంటే ఇక ఆయన తండ్రి పాత్ర అంటే ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉండాలి అనేందుకు తగ్గట్లుగా ఈ రోల్ కోసం జక్కన్న కొందరిపై టెస్ట్ షూట్ చేసి సీనియర్ యాక్టర్‌ను ఫైనల్ చేశారు. ఇందుకు విలక్షన్ నటుడు ప్రకాష్ రాజ్‌ను మహేష్ తండ్రి పాత్ర కోసం రాజమౌళి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసినా జక్కన్న సంతృప్తి చెందకపోవడంతో ప్రకాష్ రాజ్ వద్దకు ఈ పాత్ర చేరింది. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే ప్రకాశ్ రాజ్ శివుడి భక్తుడిగా ఉన్నట్లు తన పాత్ర సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వారణాసిలో.. రుద్రగా మహేష్, మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ ‘కుంభ’గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా వీరి లుక్స్ కూడా రిలీజ్ చేశారు.

ప్రకాష్ రాజ్ తో మహేష్ స్క్రీన్ షేర్..!

ఇంతకు ముందు మహేష్, ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేశారు. కొన్నింటిలో విలన్ రోల్ చేస్తే మరికొన్నింటిలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మురారి, బ్రహ్మోత్సవం, ఒక్కడు, దూకుడు, ఖలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు, బిజినెస్ మ్యాన్, పోకిరి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, గుంటూరు కారం మూవీస్‌లో కలిసి నటించారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో మహేష్ తండ్రిగా నటించారు. ప్రతిష్టాత్మక ‘వారణాసి’లోనూ తండ్రి క్యారెక్టర్‌‌గా ఆయనైతేనే సరిపోతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా… ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. ఇక ఈ మూవీ 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా… ఏడాది ముందు నుంచే మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’లో ‘వారణాసి’ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న అవతార్ రిలీజ్ కానుండగా ఈ మూవీతో పాటే ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ కూడా ప్లే చేయనున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *