Prabhas : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో ప్రభాస్ పేరు అగ్రస్తానంలో ఉంటది. బాహుబలి అనే సినిమా కోసం ఐదు సంవత్సరాలు కేటాయించి ఒక డేర్ స్టెప్ వేశాడు. ఆ డేరింగ్ అనేది ప్రభాస్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఆ సినిమా కోసం వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటి, రెబల్ స్టార్ ప్రభాస్ – వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో రాబోతున్న హై-వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అయితే, సినిమా విశేషాలు గానీ, ప్రభాస్ లుక్ గానీ ఏమాత్రం లీక్ కాకుండా ఉండేందుకు సందీప్ వంగా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న కొత్త లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారట. రాబోయే ఆరు నెలల పాటు ప్రభాస్ పబ్లిక్ అప్పీయరెన్స్‌లకు దూరంగా ఉండాలని సందీప్ వంగా ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది. ఏ ముహుర్తానా అలా అన్నాడో గానీ… అంతలోనే స్పిరిట్ లోని ప్రభాస్ పోలీస్ లూక్ ఇప్పుడు లీక్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఒక పండగ కాదు పోర్రీ.
స్పిరిట్ పూజ కార్యక్రమంలో డార్లింగ్ లుక్ వైరల్..
ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని స్పిరిట్ సెట్స్ నుంచి లీకైన ఫోటోగా చెబుతున్నారు. ప్రభాస్ మాత్రం ఫోటోలో చాలా అందంగా కనిపిస్తున్నాడు. బ్లాక్ కలర్ హుడి వేసుకుని, వైట్ పాంట్ లో జోబు లో చేతులు పెట్టుకొని స్టైలిష్ గా క్యాప్ పెట్టుకుని నిలుచున్నాడు. ఎదురుగా సందీప్ రెడ్డి వంగ సీన్ ఎక్స్టెయిన్ చేస్తున్నాడు. వెనుక సినిమాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ సెట్ కూడా కనిపిస్తుంది.
అంతగా సక్సెస్ లోని ప్రభాస్..
మన డార్లింగ్ ప్రభాస్ కి.. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఊహించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అంతే కాకుండా ఆ మూడు సినిమాల విషయంలో కూడా విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ప్రభాస్ అందం అంతా ఏమైపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లీక్ అయిన ఫోటోతోటి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ పెట్టినట్లు అయ్యింది. సినిమా ఎప్పుడైనా రాని.. ప్రభాస్ సక్సెస్ వస్తే చాలా అని ఫ్యాన్స్ పట్టు పట్టుకున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ కి నెత్తిపైనా అరడజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక తాజాగా రాజా సాబ్ అయితే రిలీజ్ కు సిద్దం అయ్యింది. రేపే మాపో ప్రామోషన్లు కూడా మొదలు పెడతారు. ఇక మరో పక్క.. కల్కి 2, సలార్ 2 వంటి సినిమాలు ఎంత హై క్రియేట్ చేశావో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ వరల్ సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి అంటే.. ఇండియాతో పాటు యావత్ ప్రపంచ దేశాలు అన్ని కూడా వేయ్యి కళ్లతో ఎదురు చూడక తప్పదు మరి. మరి చూడాలి సందీప్ రెడ్డి వంగా ఈ లీక్ పై ఎలా స్పందిస్తారో.