Prabhas' heroine Imanvi breaks the rumors with a single video

హను రాఘవపూడి.. ప్రముఖ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రముఖ మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం ఇది. అలాగే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ను తొలిసారి చాలా సాంప్రదాయంగా సీత పాత్రలో చూపించి, ఆమెకు ఊహించని పాపులారిటీని అందించారు. ఈ ఒక్క సినిమా అటు డైరెక్టర్ కే కాదు ఇటు నటీనటులకు, నిర్మాతలకు కూడా మంచి విజయాన్ని అందించడమే కాకుండా వందకోట్ల క్లబ్లో చేర్చి ఇండస్ట్రీకి ఊరట కలిగించింది.

అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజీ అంటూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. అటు ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజే హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ ని కూడా పరిచయం చేశారు. వాస్తవానికి ప్రభాస్ హీరోగా చేస్తున్నారు అంటే ఆయన పక్కన స్టార్ హీరోయిన్ లేదా భారీ పాపులారిటీ ఉన్న హీరోయిన్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే హను రాఘవపూడి మాత్రం నటనలో అస్సలు అనుభవం లేని.. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను హీరోయిన్ గా ప్రకటించడంతో చాలామంది హను రాఘవపూడిపై విమర్శలు గుప్పించారు. అసలు నటనే తెలియని అమ్మాయికి ఇంత పెద్ద సినిమాలో అది కూడా ప్రభాస్ పక్కన అవకాశం ఎలా కల్పించారు అంటూ ప్రభాస్ భిమానులు అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అంతేకాదు నాడు హను రాఘవపూడి పై ఎవరైతే అసహనం వ్యక్తం చేశారో.. వారే ఇప్పుడు హను రాఘవపూడి నిర్ణయం పర్ఫెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ అమ్మాయి కి సంబంధించిన ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇమాన్వి ఇస్మాయిల్.. ఎప్పుడైతే ప్రభాస్ ఫౌజీ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారో అప్పటినుంచి ఈమె వెలుగులోకి వచ్చింది. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి గానీ అటు సోషల్ మీడియాకి గానీ దూరంగా ఉన్న ఈమె.. సడన్ గా ఒక వీడియోతో అందరినీ అబ్బురపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇమాన్వి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు డాన్సర్ , కొరియోగ్రాఫర్ కూడా.. ఈమె వీడియోలకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ కూడా ఉంది.

డాన్స్ అంటే అందమైన అభినయం అని చెబుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు వెస్ట్రన్ డాన్స్ అయినా.. ట్రెడిషనల్ డాన్స్ అయినా ఈమె వేసే స్టెప్పులే చాలా భిన్నంగా ఉంటాయి. అలా ఇప్పుడు కూడా తన అద్భుతమైన డాన్స్ వీడియోతో అందరినీ ఆకట్టుకుంది ఇమాన్వి. తాజాగా ఈమె తన ట్రైనర్ తో కలిసి అద్భుతంగా క్లాసికల్ వీడియో కి డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాన్సులో ఈమె చేస్తున్న నృత్య కదలికలకు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ అమ్మాయి తన ముఖంలోనే ఎక్స్ప్రెషన్స్ అన్నింటిని చక్కగా పలికిస్తోంది కచ్చితంగా ఈ సినిమాకి ఈమె నటన ప్లస్ అవుతుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా గతంలో హను రాఘవపూడిపై చేసిన ట్రోల్స్ కి ఇమాన్వి తన అద్భుతమైన వీడియోతో చెక్ పెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *