ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసిన అన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. ఒక వైపు ప్రపంచ దేశాల మధ్య యుద్దాలు జరిగితే.. మరో పక్క ప్రతృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక ఇవి కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఘోరమైన విమాన, రైలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని లూయిస్ విల్లే ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. బయలుదేరిన కొద్దిసేపటికే కార్గో ఫ్లైట్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో లూయిస్ విల్లేలోని ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రితమే కూప్ప కూలిపోయింది అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కొల్పోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది గాయపడ్డారు. ఇక కూలిపోయిన విమానం మెక్‌డోనల్డ్స్ డగ్లస్ ఎండీ-11 మోడల్‌గా గుర్తించారు. లూయిస్‌విల్లే నుంచి హవాయికి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ధ్రువీకరించింది. ఇప్పటివరకు ముగ్గురు సిబ్బంది మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారని కెంటకీ గవర్నర్ ఆండీ బేషియర్ తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాగా, విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఎడమ ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చినట్లుగా కనిపించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి విమానం కుప్పకూలింది. విమానం కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లుగా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు చేపట్టింది. ఇక ప్రమాద స్థలం UPS యొక్క అతిపెద్ద ఎయిర్ హబ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి రోజుకు 300 విమానాలను నడుపుతారు. గంటకు 400,000 కంటే ఎక్కువ ప్యాకేజీలను క్రమబద్ధీకరించే విశాలమైన లాజిస్టిక్స్ కేంద్రం ఇది. వేలాది మంది ఉద్యోగులు ఈ ఈ ఆఫీసులో పనిచేస్తున్నారు.