దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు.
ఇక విషయంలోకి వెళ్తే…
ఇటీవల కాలంలో చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళుతున్న చిన్నారులపై కుక్కలు దాడి చేయడం.. పిల్లలు గాయాలు పాలవడం ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఈ కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న ఇలాంటి సంఘటనలు నమోదు అవుతునే ఉన్నాయి. చాలా వరకు ఈ కుక్కల దాడిలో.. పలువురు చిన్నారులు మృతి చెందారు. ఇప్పుడు మరో ఘోరమైన కుక్క దాడి జరిగింది.
కుక్కలు బాబోయ్ కుక్కలు..

దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి (Pit Bull Attack) చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు. ఆదివారం సాయంత్రం 5.38 గంటల సమయంలో ప్రేమ్‌నగర్ ప్రాంతంలోని విజయ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేశ్ పాల్ (50) అనే టైలర్‌కు చెందిన పిట్‌బుల్ (Pit Bull) జాతి కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడే అక్కడున్న బాలుడిపై దాడి చేయబోయింది. పిల్లవాడు దాని బారి నుంచి తప్పించుకుని పరుగుతీస్తుండగా వెంటాడిన కుక్క అతనిపై ఎగబడింది. ఓ మహిళ దానిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది ఆగలేదు. అక్కడే ఉన్న మరో వ్యక్తి దానిని గమనించిన ఆ బాలుణ్ని రక్షించబోయారు. అయినప్పటికీ బాలుడిని వదలని శునకం.. అతని కుడి చెవి తెగిపోయేలా కరిచింది. బాలుడి శరీరంపైనా పలుచోట్ల గాయాలయ్యాయి. చుట్టుపక్కల వాళ్లు వెంటనే బాలుడిని రోహిణిలోని బీఎస్ఏ హాస్పిటల్‌కి, అక్కడి నుంచి సఫ్దార్‌జంగ్ దవాఖానకు తరలించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
దేశంలో నిషేధించిన పిట్ బుల్ బ్రీడ్ కుక్కలు..!

ఇక బాలుడిపై దాడి చేసిన శునకం పిట్ బుల్ బ్రీడ్ కు చెందినది. వాస్తవానికి ఈ జాతి శునకాల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ చాలామంది వీటిని పెంచుకుంటున్నారు. తాజా దాడిపై బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శునకం యజమానిని రాజేశ్‌పాల్‌పై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసుపెట్టిన పోలీసులు.. హత్యాయత్నం కింద అతడిని అరెస్టు చేశారు. రాజేశ్ పాల్ కుమారుడు సచిన్ పాల్.. సుమారు ఏడాదిన్నర క్రితం ఆ శునకాన్ని పెంచుకునేందుకు ఇంటికి తెచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అతడు ఓ హత్యా నేరంపై జైలులో ఉన్నాడు. కాగా, కుక్క తన యజమాని చేతి నుంచి విడిపించుకుని ఈ దారుణానికి పాల్పడిందని బాలుడి తాత కామేశ్వర్ రాయ్ చెప్పారు. అతని తల వెనుక భాగంలో ఎనిమిది నుంచి పది కుక్కకాట్లు పడ్డాయన్నారు. ప్రస్తుతం శునకం దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం రోహిణిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.