Over 2,00,000 CHIKV virus cases in China, should a lockdown be imposed?
  • చైనాలో మరో వైరస్ కలకలం..
  • చైనాలో మిని ఎమర్జెన్సీ..
  • వైరస్ బాధితులతో కిక్కిరిసిపోయిన చైనా హాస్పిటల్స్
  • చైనాలో రోజు రోజుకు పెరుగుతున్న అంతుచిక్కని వ్యాధి
  • చైనాలో మరో వైరస్ ని కనిపెట్టిందా..?
  • నిజంగా చైనా బయో వార్ కోసమే వైరస్ ను సృష్టిస్తుందా..?
  • ఇటీవలే చైనా ల్యాబ్ నుంచి బయటపడ్డ డేంజరస్ ఫంగస్..
  • ఇప్పుడు మరో కొత్త వైరస్.. చైనా కుట్రేనా..?
  • మరో సారి ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా..?
  • ఈ వైరస్ కోవిడ్ కన్నా ప్రమాదమా..?
  • మొన్న కోవిడ్.. నిన్న ఫంగస్.. నేడు మరో కొత్త వైరస్.. అసలేం చేస్తుంది చైనా ప్రభుత్వం ..?

అసలేంటి ఆ వైరస్..?

చైనా… ఈ దేశం పేరు వింటే చాలా.. ప్రపంచ దేశాలకు ఒక్కటే గుర్తుకు వస్తుంది. అదే కోవిడ్ (Covid). ఇక్కడ ఈ పదం వాడటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకరికొకరు చేతులు కలిపిన, గాలి పీల్చిన.. ఊపిరి వదలాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి.. ఆర్థిక మాంద్యం మొదలైంది. ఇక అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడిన.. దాని మూలాలు చైనాలోనే కనిపిస్తున్నాయి. తాజాగా, చైనా వాసులను మరో ప్రాణాంతక వ్యాధి పట్టిపీడిస్తోంది. కొవిడ్ తర్వాత అంత ప్రాణాంతకమైన వ్యాధి ఇదేనట. వివరాల్లోకి వెళితే..

ప్రపంచ దేశాలను కోవిడ్-19 (Covid-19) మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోవిడ్ -19 పేరు వింటే భయపడే పరిస్థితి. ఇంకా చైనాతో పాటు భారత్ లో కూడా ఈ కొవిడ్ పంజా విసురుతుంది. అయితే అలాంటి చైనాలో పలు రకాల వైరస్‌లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంతో కొవిడ్ 2020 ఆడింది. ఆ కరోనా భయం నుంచి ఇలా బయటపడ్డామో లేదో.. చైనాలో మరో వైరస్ చాపాకింద నీరులా విజృంబిస్తుంది. అదేదో కొత్త వ్యాధి అయితే కాదు.. మనకు బాగా పరిచయం ఉన్న వ్యాదే అదే చికున్ గున్యా… అవును ప్రస్తుతం చైనా దేశాన్ని చికున్ గున్యా (Chikungunya) వ్యాధి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాగా చైనాలో విజృంబిస్తున్న ఈ చికున్ గున్యా ప్రాణంతాక వ్యాధి అని చెబుతున్నారు. దీంతో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? దాని లక్షణాలు ఏమిటి?… తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

చైనాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా.. చికున్ గున్యా

చైనాలో ( China) కొవిడ్ తర్వాత ప్రజలు ప్రస్తుతం చికున్ గున్యా వ్యాధితో (Chikungunya) అవస్థలు పడుతున్నారు. తాజాగా CHIKV అని పిలిచే ఈ వైరస్ చైనాలోని చాలా ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వల్ల తీవ్ర జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. దీని దెబ్బకు దక్షిణ చైనా షెన్‌జెన్ పరిధి ఫోషాన్ నగరంలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయట. అవును ప్రస్తుతం చైనాలో ఎక్కడ చూసినా చికున్ గున్యా వ్యాధి బాధితులే కనిపిస్తున్నారు చైనాలో చాలా వరకు ఈ వ్యాధి కారణంగా హాస్పిటల్ కిక్కిరిపోయాయి. దీంతో ఎక్కువ మంది రోగులకు వసతులు కల్పించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకూ చికున్ గున్యా కేసులు పెరిగిపోతున్నాయని స్థానిక మీడియా ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖాధికారులు అలెర్ట్ అయ్యారు. ఫోషాన్‌లోని షుండే, నాన్‌హై జిల్లాల్లో శనివారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారట. ఇళ్లు, పరిసరాల్లో వారాంతంలో పారిశుధ్య పనులు చేపట్టాలని, దోమలు చేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో అవగాహన పెంచే పనిలో ఉన్నారు. హాంకాంగ్ కూడా ఈ వైరస్‌పై హెచ్చరికలు జారీ చేసింది. షుండేలో జూలై 8న మొదటి కేసు నమోదైందని స్థానిక ఆరోగ్యాధికారులు చెబుతున్నారు. మొదటగా.. ఇక, నాన్‌హై జిల్లాలో 16 కేసులు, చాన్‌చెంగ్‌ జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. గ్వాంగ్‌డాంగ్ సరిహద్దులో ఉన్న మకావులో ఒక కేసు నమోదు కాగా.. ఆ వ్యక్తి ఫోషాన్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు.

రోజురోజుకూ చికున్ గున్యా కేసులు..

చైనాలోని scmp.com అనే మీడియా సంస్థ ప్రకారం.. దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరం (Foshan city) లో చికున్‌గున్యా వేగంగా వ్యాపిస్తోంది. షుండేలోని ఆరోగ్య విభాగం ప్రకారం.. ఆ ఒక్క ప్రాంతంలోనే నాటికి 1,161 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఎక్కువ భాగం బీజియావో (Beijiao), లెకాంగ్, చెన్‌కున్ పట్టణాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే నాన్హై జిల్లాలో 16 కేసులు, చాంచెంగ్ జిల్లాలో 22 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు హాంకాంగ్‌లో (Hong Kong) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో చివరిసారిగా 2019లో చికున్ గున్యా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ఏడాది 11 కేసులు, 2018లో రెండు, 2017లో ఒకటి, 2016లో 8 కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌లో చివరిసారిగా 2019లో చికున్ గున్యా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ ఏడాది 11 కేసులు, 2018లో రెండు, 2017లో ఒకటి, 2016లో 8 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 2,20,000 చికున్‌ గున్యా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. చికున్‌గున్యా అనేది CHIKV వైరస్. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల జ్వరం, ఒంటి నొప్పి వస్తాయి. ఇది కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయవచ్చు. వర్షాకాలంలో దీని వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. CHIKV వైరస్ ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది.

చికున్‌గున్యా ఎలా వ్యాపిస్తుంది?

చికున్‌గున్యా జ్వరం దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులకు సాధారణంగా జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. ఈ కీళ్ల నొప్పులు నెలలు తరబడి కొనసాగుతాయి. ఈ వ్యాధి బారినపడ్డవారు నడవడం కష్టమైపోతుంది. కండరాల నొప్పి, వికారం, దద్దుర్లు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. చికున్‌గున్యా అనే పదం తూర్పు ఆఫ్రికన్ భాష (ఆఫ్రికన్ భాష) కిమాకొండే నుండి వచ్చింది. దీని అర్థం ‘‘వైకల్యం చెందడం’’. ఇక చిక్కున్ గున్యా వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇల్లు, బహిరంగ ప్రదేశాలలో నిలిచిపోయిన నీటిని తొలగించాలని కోరుతున్నారు. ఇంటి మురుగు కాలువలు, కంటైనర్లను శుభ్రపరచడం, దోమల వ్యాప్తిని తొలగించడానికి ఇంటిని పూర్తిగా శుభ్రపరచడం వంటి జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 220,000 కంటే ఎక్కువ చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. తైవాన్, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో ఈ కేసులు నివేదించబడ్డాయి. భారతదేశంలో కూడా చికున్ గున్యా కేసులు నమోదవుతాయనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. చైనా ల్యాబ్‌ (China Lab) నుంచి 2025 జూన్‌లో మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్‌ని డ్రాగన్ కంట్రీ (Dragon Country) అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు. మిషిగన్ యూనివర్సిటీలో (University of Michigan) పరిశోధనల కోసం ఫంగస్ తరలిస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో FBI అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తైవాన్, సింగపూర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 220,000 కేసులు..!

నిజానికి డ్రాగన్ కంట్రీ కడుపు నిండా కుట్రలే. ఆ దేశంలో బయో టెక్నాలజీ (Biotechnology) పై చేస్తున్న పరిశోధనలు వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. చైనా గురించి చెప్పాలంటే ఒక్క కరోనా పేరు చెప్తే చాలు. ప్రపంచ శక్తిగా ఎదగాలనుకునే చైనా కోరిక నెరవేర్చుకునేందుకు ప్రపంచదేశాలను ప్రమాదంలో పడేస్తోంది. ప్రాణాలను తీసేదాకా పోతుంది. ఆ బయో వార్ తో తమ దేశానికి ప్రమాదం ఉందని తెలిసినా… తన లక్ష్యాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. చైనా దేశం ఈ ప్రపంచంలో ఎక్కడ లేని వ్యాధులను సృష్టించాలి.. తిరిగి వాటికి మెడిసిన్ కనిపెట్టాలనే లక్ష్యంగానే చైనాలో వేల సైంటిస్టులు పని చేస్తున్నారు. చైనా చేసిన బయోవార్ ప్రయోగాలు నిజమని ఆధారాలు లేవు కానీ.. ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా కోడై కుస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆ ఆరోపణలకు బలం చేర్చుతున్నాయి.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *