తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్న ఈ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని చెన్నై నగరంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగు చూసింది.
ఇక విషయంలోకి వెళ్తే..
నిజంగా ప్రస్తుత సమాజంలో ఎవరికి కూడా నేరుగా షాపింగ్ మాల్స్ కి పోయి.. షాపింగ్ చేయడం లేదు. చాక్లెట్ నుంచి కోట్లు విలువ చేసే వస్తువుల వరకు అంతా ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్, ఆమెజాన్ వంటి ఈ కామర్స్ ప్లాప్‌ఫామ్‌లలో గ్యాజెట్స్ ఆర్డర్ చేస్తే కొన్ని సార్లు ఫేక్ వస్తువులు రావడం మనం చాలానే చూశాం. ఐఫోన్ బుక్ చేస్తే అందులో బట్టల సబ్బు వస్తుంది. ల్యాప్ టాప్ బుక్ చేస్తే.. అందులో బరువైన ఇనుప రేకు వస్తుంది. ఇలా ఒకటా రెండా.. ఎడ చూసిన ఆన్ లైన్ ఆర్డర్లు, ఘారణ మోసాలు గివే కంటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి మోసమే చెన్నైలో వెలుగు చూసింది.
ఆన్ లైన్ లో 4 కోట్ల వాచ్ ఆర్డర్.. డెలివరి అయిన 400 వాచ్..!

ఆన్‌లైన్‌లో వాచ్ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన వాచ్ డెలివరీ తీసుకునేందుకు వెళ్లిన అతను డెలివరీలో వచ్చిన దాన్ని చూసి కంగుతిన్నాడు. ఓ ప్రముఖ బట్టల వ్యాపారి కుమారుడు ఇటీవల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ.4 కోట్ల విలువైన వాచ్‌ను చూసి మనసుపారేసుకున్నాడు. దాన్ని ఎలాగైనా కొనాలని నిర్ణయించుకొని. స్థానికంగా ఉన్న ఒక ఏజెంట్‌ను సంప్రదించాడు. అతని ద్వారా వాచ్ కొనేందుకు అతని ముందుగా ఆన్‌లైన్‌లో రూ.2.3 కోట్లు చెల్లించాడు. ఇక డబ్బులు చెల్లించాడు.. అంతే స్పీడ్ లో వాచ్ కూడా డెలివరి వచ్చేసింది. ఇక మంగళవారం తను చేసిన ఆర్డర్ వచ్చినట్టు అతనికి కాల్ వచ్చింది. దీంతో ఆర్డర్ తీసుకునేందుకు ఆతను ఎంతో ఆశగా, ఆత్రుగా బయల్దేరాడు. డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకున్నాడు. వెంటనే దాన్ని విప్పి చూశాడు. అందులో తును ఆర్డర్ చేసిన రూ.4 కోట్ల విలువైన వాచ్‌కు బదులుగా కేవలం రూ.400 విలువైన చౌకబారు వాచ్ ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఏజెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌గా చెల్లించిన రూ. 2.30 కోట్లు తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చుసుకున్న కొట్టూరుపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు విచారణ కోసం పంపనున్నట్లు పోలీసు వర్గాల్లో సమాచారం అందింది.