- కర్ణాటకలో వింత ఘటన..
- 3 దశాబ్దాలుగా ఇంజన్ ఆయిల్ తాగుతున్న కుమార్..
- బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ కాదు.. ఇంజన్ ఆయిల్.. తన ఇందనం..
- 33 ఏళ్లుగా కాలిపోయిన ఇంజన్ ఆయిలే.. తన ఆహారం
- ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, రోజంతా ఆయిలే ఆహారం..
- రోజుకు 7 నుంచి 8 లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగుతున్న ఆయిల్ కుమార్
- తన ఆరోగ్యం వెనుక అయ్యప్ప స్వామి దయ అంటున్న కుమార్
మానవ.. మనిషి శరీరం ఆరోగ్యంగా జీవనం సాగాలంటే.. కడుపులో కాస్త తిండి పడాల్సిందే. తెలుగులో ఒక సామెత ఉంది.. కొటి విద్యలు కూటికోరకేరా అని. అవును ఇది నగ్న సత్యం. సాధారణంగా ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేవగానే టిఫిన్‌లో ఇడ్లీ, దోశ తినడం అందరికీ అలవాటు. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఇంజన్ ఆయిల్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. నిజంగా ఇది ప్రస్తుతం జరుగుతున్న ఘటనే. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తూ బ్రతికే ఉన్న ఓ వ్యక్తి కథ.
ఇక విషయంలోకి వెళ్తే…
మీకు కర్ణాటకలోని ఒక మందు స్టోరీ గుర్తుకు ఉండే ఉంటుంది. కేవలం 10 వేల పందానికి ఒక యువకుడు 5 ఫుల్ బాటిల్స్ దించకుండా తగిన ఘటన.. ఇప్పటి కళ్ల ముందే ఉంది. ఆ ఘటనలో ఆ యువకుడు శరీరంలోని రక్తంలో మొత్తం విస్కీ చేరి.. బ్లేట్ లేవల్స్ పూర్తిగా పడిపోయి మరణించారు. కానీ అచ్చం అలాంటి ఘటనే.. కానీ ఇక్కడ తాగేది మందు అయితే కాదు.. అదే వింత ద్రవం.. మన రోజు వినియోగించే ఒక రసాయనం.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ ఈ వింత అలవాటుతో స్థానికంగా సుపరిచితుడయ్యాడు. వాహనాలకు ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు వచ్చే వేస్ట్ ఆయిల్‌ను సేకరించి దాన్నే ఆహారంగా తీసుకుంటాడు. ఉదయం టీ తాగినట్టుగా, మధ్యహానం, సాయంత్రం జూస్ తాగినట్లుగా కుమార్ ఇంజన్ ఆయిల్ ని తాగేస్తున్నాడు. ఇలా ప్రతి రోజు కుమార్ తన రోజును ఇంజన్ ఆయిల్ తోనే ప్రారంభిస్తాడు. రోజంతా కలిపి దాదాపు 7 నుంచి 8 లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగుతాడు. కొందరు అతనికి ఫుడ్ ఇస్తే తీసుకోకుండా బాటిల్‌లో ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వీడియోలో దృష్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అతని విచిత్రమైన ఆహారపు అలవాట్ల గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు. దీంతో స్థానికులు అతడిని ముద్దుగా ‘ఆయిల్ కుమార్’ అని పిలుచుకుంటున్నారు.

వాస్తవానికి.. మన రోగుల ప్రపంచంలో ఉన్నాం, మనకు గానో గానీ, మన ఇంట్లో గానీ ఎవరో ఒకరు ఈ వ్యాధుల బారిన పడి నరకం చూస్తుంటారు. ఇంకొందరు అయితే.. చావు బతుకుల వారకు వెళ్లి పునర్ జీవితం పొందుతారు. అపరిశుభ్రమైన నీరు తాగితే.. మన ఆరోగ్యం కిందకి మీదకు అవుతుంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ ఈ కుమార్ అనే వ్యక్తి దాదాపు 33 సంవత్సరాల నుండి ఆయిల్ తాగుతున్నాడు. ఇంత ప్రమాదకరమైన అలవాటు ఉన్నప్పటికీ, తన ఆరోగ్యానికి ఇప్పటివరకు ఎలాంటి హానీ జరగలేదని కుమార్ చెబుతున్నాడు. మూడు దశాబ్దాలుగా ఒక్కసారి కూడా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లలేదని అంటున్నాడు. తన ఆరోగ్యానికి అయ్యప్ప స్వామిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసమే కారణమని ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు అయ్యప్ప మాల ధరించి దీక్షలో గడుపుతానని కుమార్ తెలిపాడు. ఆయన వింత అలవాటు, ఆయనకున్న విశ్వాసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఇంజిన్ ఆయిల్ తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోటార్ ఆయిల్ తాగితే వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, కిడ్నీ, లివర్ దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా, మోటార్ ఆయిల్‌లో పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, సీసం, రాగి వంటి విషపూరిత పదార్థాలు ఉంటాయి, ఇవి క్యాన్సర్ కారకాలుగా పరిగణించబడతాయి. వాస్తవానికి.. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటి వింతే ఈ ఆయిల్ కుమారి జీవితం.
మన పెద్ద వాళ్లు సరైన ఆహారం తీసుకోకపోతే బతుకు బండి నడవదని సరదాగా అంటుంటారు. ఈ లైన్‌ను సీరియస్‌గా తీసుకున్నాడేమో ఈ వ్యక్తి. అందుకేనేమో తన శరీరం ను మోటార్ సైకిల్ అనుకోని.. నిత్యం ఆయిల్ చేంజ్ చేస్తున్నాడు.
ఈ విచిత్రమైన వ్యక్తి కథ నిజమా లేక కేవలం ఒక ప్రాంక్ వీడియోనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, గతంలో కూడా ఇలాంటి విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉన్న వ్యక్తుల గురించి వార్తలు వచ్చాయి. కానీ, ఇంజిన్ ఆయిల్ వంటి విషపూరిత పదార్థాలు తాగడం చాలా ప్రమాదకరమని, అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.