Officials feed worm-infested rice to school students in Telangana
  • తెలంగాణలో రోజురోజుకూ అధ్వానంగా మారుతున్న పాఠశాలలు
  • పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు..
  • ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ KGBV హాస్టల్ లో కలుషిత ఆహారం..
  • హాస్టల్ విద్యార్థులు మన బిడ్డ కాదా..?
  • విద్యార్థులకు పురుగుల పులిహోర పెట్టిన అధికారులు..
  • దారి తప్పిన విద్యాశాఖ అధికారులు..
  • విద్యాశాఖను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం..
  • సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై పట్టింపు లేదా..?

హాస్టల్ విద్యార్థులు మన బిడ్డ కాదా..?

ప్రభుత్వ హాస్టల్ లో చదివే విద్యార్థులు రేపటి దేశ భావి భారత పౌరులు. మనల్ని నమ్మి బడికి పంపించిన గారాల బిడ్డలు వాళ్లు. విద్యార్థుల కంట్లో నలుసు పడిన తీసే గార్డియన్ లా ఉండాలి.. అని ఇటీవల అధికారంలో స్ఫూర్తిని నింపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖలో నిధుల కేటాయింపులు కూడా పెంచుతున్నామని భరోసా ఇచ్చారు. కానీ ఆయనకు అంటున్న బంగారు కలలు కలలుగానే ఉంటున్నాయి. విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకున్నారు. భోజనం యొక్క నాణ్యత ఏ రిపోర్ట్ చేయాలి. వాళ్లు తినేదే మీరు తినాలి. వాళ్లు మన బిడ్డ లాంటి వాళ్లే. సర్కార్ హాస్టల్ లో స్థితిగతులు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఇవి. కాని అక్కడ పరిస్థితులు ఇసుమంతైనా మార్పులు లేవు.. విద్యార్థుల వసతి గృహాల్లో ఎటు చూసినా ఏడుపులే.. కాలే కడుపులే.. విద్యార్థుల అరిగోసలే..

విద్యార్థులకు పురుగుల పులిహోర పెట్టిన అధికారులు..

ఇక్కడ విద్యార్థులు రాజ భవనాలు అడగడం లేదు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అడగడం లేదు, లగ్జరీ లైఫ్ అంతకన్న అడగం లేదు.. కేవలం పెట్టే ఒక్క పూట అన్నమైనా.. నాన్యతతో పెట్టండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు లోని (KGB) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు రోజులుగా విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కు అవుతుంది. బుధవారం ఉదయం అల్పహారం గా పెట్టిన పులిహోరలో పురుగులు ప్రత్యక్షం అయ్యాయి. నోట్లో పెట్టుకోవడానికి వీలు లేక తినకుండానే కడుపులు మార్చుకొని అలాగే క్లాసులకు వెళ్లిపోయారు ఆ అమాయక విద్యార్థులు. ఇక విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ( Sub Collector Yuvaraj Marmat ) పాఠశాలను సందర్శించారు. అక్కడ పురుగుల పులిహోరను చూసి షాక్ అయ్యారు. బాలికలతో మాట్లాడి సాధిక బతకాలని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, వంటశాలలో వంటకాలు, గిడ్డంగిలో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, పాఠశాలలో శుభ్రతతో పాటు మేను ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు. వారం రోజులపాటు పాఠశాలను తనిఖీ చేయాలని జీసీడీవో ఉదయ్ శ్రీ, ఎంఈవో పవర్ అనితకు సూచించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా దృష్టికి తీసుకెళ్తామన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ కట్ చేస్తే మరుసటి రోజు విజిట్ కోసం MEO వచ్చారు. పాఠశాలలో ఆమె స్వయంగా ఉండి.. విద్యార్ధుల కోసం ఉప్మా వండించారు. షాకింగ్ ఏంటంటే అందులోనూ పురుగులే కనిపించాయి. దీంతో MEO కంగుతిన్నారు.

విద్యార్థుల ధర్నా..

ఇక ఏం చేయలేక విద్యార్ధులందరూ.. ప్లేట్లన్నీ ఒక్కచోట చేర్చి ఇది మా దినసరి బతుకు సార్ అంటూ ప్రభుత్వ పెద్దలకు వినబడేలా, సీఎం రేవంత్ రెడ్డి కి వినబడేటా పెద్దఎత్తున్న నినాదాలు చేశారు దగాపడ్డ బాలికలు. ఇక ఆ రోజు ఏమీ తినకుండానే క్లాసులకు హాజరయ్యారు. దగ్గరలోని జడ్పీ స్కూల్ నుంచి బియ్యం తెప్పించి వంట చేయించి సాయంత్రం భోజనం పెట్టేదాకా విద్యార్ధులందరూ కూడా ఖాళీ కడుపు లే. మూడు వారాలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి ఒకే గదిలో నిల్వ చేయడం అలు గడ్డలు కుళ్ళిపోవడం, బియ్యానికి లెక్క పురుగులు పట్టడం, ఇవన్నీ ఈ ఒక్క KGVB కాదు.. ప్రతి హాస్టల్లో కనిపించే దిక్కుమాలిన దృశ్యాలే. కాకపోతే ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం భాదకారం. రెండోవ రోజు కూడా అప్పుడే పురుగుల ఉప్మా పెట్టాకా తెలిసింది. రాష్ట్రంలో పాఠశాలలు, హాస్టల్లో ఏ స్థాయిలో ఉందో మన కళ్లకు కడుతుంది. విద్యార్థి సంఘాల నేతలు ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి.. అధికారుల తీరని దుయ్యబడుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన మౌలిక సదుపాయాల కోసం విద్యా శాఖలో 21 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం దర్పంగా ప్రకటించుకున్న.. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అవే సీన్లు.. అవే పురుగుల పులిహోర దృశ్యాలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *