Nitish Kumar creates record as Bihar's 10th CM...!

Bihar’s New CM : బీహార్ 10వ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్…!

Nitish Kumar creates record as Bihar’s 10th CM…!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ సహా మొత్తం 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పూర్తి కాలం ఉంటే.. దేశంలోనే అతి ఎక్కువ కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కనున్నారు.

10వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం..!

బీహార్ రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మొత్తం 243 స్థానాలకు గాను 202 సీట్లను కైవసం చేసుకుని బీహార్ చరిత్రలోనే అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డు తిరగ రాస్తు 10వ సారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణం చేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో గురువారం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బిహార్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం దేశంలో ఎన్డీఏ బలాన్ని చాటి చెప్పింది అనే చెప్పాలి. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూత పాల్గొండ్రు. బిహార్‌లో మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అందరికీ శుభాకాంక్షలు చేప్పారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు అని.. ఇది అద్భుతమైన టీమ్ అని.. అంకితభావం కలిగిన నాయకులు బిహార్‌ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తారుని ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేప్పట్టడం అందిరి దృష్టి అయితే ఆకార్శించింది. అంతకు ముందు.. గీ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ (24 సంవత్సరాలు) రికార్డును అధిగమించి.. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచే రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఇక నితీష్ కుమార్ సహా మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

రెండు పార్టీల్లో పదవుల పంట…

ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమి 202 సీట్లను సాదించారు. ఇందులో బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీకి 14 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇక 85 సీట్లు గెలిచిన జేడీయూకి 9 మంత్రి పదవులు.. ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. బీజేపీ తరఫు నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు మరోసారి బిహార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసిండ్రు. బీజేపీ నుంచి దిలీప్ జైస్వాల్ వంటి అనుభవజ్ఞులతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల శ్రేయసి సింగ్ కూడా మంత్రిగా ప్రమాణం చేసిండ్రు. ఇగ జేడీయూ నుంచి.. బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి వంటి సీనియర్ నేతలకు మళ్లీ మంత్రి పదవులు దక్కాయి. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ).. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్ అవామ్ మోర్చా.. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్ నుంచి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *