Nitin Gadkari's bumper offer to motorists...

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరో సారి గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశంలో టోల్ గేట్ (Toll gate) టోల్ కట్టే విధానం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తు ట్యాక్స్ కట్టే వారికి వరుసగా మరో సారి శుభ వార్త చెప్పింది. ఈ సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ స్వాతంత్ర్య దినోత్సవ నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచించింది. ఇక విషయంలోకి వెళ్తే…

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఈ స్వాతంత్య్ర దినోత్సవమే (Independence Day) కానుక ప్రకటించింది. హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ కొత్త పాసులు తీసుకొస్తోంది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తరచూ టోల్‌ రోడ్డు వారే వాడికి అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్‌ ట్యాగ్‌పై కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు.

ఫాస్టాగ్…

ఫాస్టాగ్ (Fastag) ఆధారిత వార్షిక పాసులు జారీ చేస్తామని తెలిపింది. దీని ద్వారా వాహనదారులు జాతీయ రహదారుల (National Highways) పై ప్రయాణించినప్పుడు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపింది. రూ.3 వేలు చెల్లించి పాస్ తీసుకోవచ్చని, దీని ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పులు దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

అవాంతరాలు లేని ప్రయాణం కోసం సరి కొత్త టోల్…

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్ట్యగ్ పాస్ను అందుబాటులోకి తెచ్చింది. రూ.3,000తో 200 ట్రిప్పులు తిరిగే అవకాశం లభించనుంది. ఈ కొత్త వార్షిక పాస్ ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రా నుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రి (Union Minister) నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలియజేశారు. కొత్త ఫాస్ట్యగ్ వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. ప్రత్యేకంగా ఈ పాస్ వాణిజ్యేతర ప్రైవేటు వాహనాల కోసం ఉద్దేశించబడింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఈ పాస్ ప్రయోజనకరంగా ఉండనుంది. యాక్టివేషన్ తేదీ నుంచి సంవత్సరంలో లేదంటే మొత్తానికి 200 ట్రిప్పులు జాతీయ రహదారిపై తిరగవచ్చు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు.

రాజ్ మార్గ యాత్ర యాప్…

ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు. ఈ వార్షిక పాస్ దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై పని చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్మార్గ యాత్ర యాప్లో అందుబాటులోకి రానుంది. అలాగే NHAI, MORTH అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల నుంచి కష్టాల తగ్గనున్నాయి. ఈ పాస్ ద్వారా సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపు జరగనుంది. అంతేకాకుండా వేచి ఉండే సమయాలు కూడా తగ్గనున్నాయి. వేగవంతమైన ప్రయాణాల కోసమే ఈ యాప్ తీసుకొచ్చినట్లు కేంద్రం కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *