New gold mines in Andhra Pradesh..

రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. చాలా మందికి రాయలసీమ అంటే కరువు, పరువు హత్యలు, ఫ్యాక్కనిజం వంటివే గుర్తుకు వస్తాయి. పేరుకే రతనాల రాయలసీమ రతనాల సీమ అంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. చాలా వరకు ఇది కరువు సీమా కాదని కనకపు వర్షం కురిపించే అక్షయపాత్ర అని ఇకపై చెప్పాలి. ఏంటీ నమ్మడం లేదా.. అవునండి నిజంగా.. ఇప్పుడు రాయలసీమలో బంగారపు గనులు బయటపడ్డాయి.

ఇక విషయంలోకి వెళ్తే..

అవును రాయలు ఏలిన రతనాల సీమ.. మన రాయలసీమ. ఇది ఒకప్పటి మాట. కాని ఇప్పుడు కాలం మారింది. కాల క్రమంలో తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతంగా, కరవుకు నిలయంగా మారింది. అయితే ఇదంతా మనం విన్నది, చూసినది ఒకవైపు మాత్రమే. కానీ ఎవరికీ కనిపించకుండా తన గర్భంలో కోట్ల రూపాయల బంగారం నిక్షేపాలు దాచుకుంది ఈ అనంత నేల. పైకి రాళ్లు రప్పలుగా కనిపించే ఈ ప్రాంతానికి కొంత లోపలికి వెళ్తే.. జిగేల్ మనే బంగారం నిక్షేపం దాగి ఉంది. ఇన్ని రోజులు మరుగన పడిన ఈ విషయాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం.. అసలు ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయో గుర్తించింది. అనంత గర్భంలో దాగిన ఆ కేజిఎఫ్ రహస్యాలపై BRK News పై ప్రత్యేక కథనం..

KGF ను మించిన బంగారపు గదులు..

మనకి సృష్టిలో.. సముద్రాలు, భూభాగం ఏర్పడినప్పుడు ఎన్నో విలువైన నిక్షేపాలు అందులో దాగి ఉన్నట్టు పరిశోధనల ద్వారా తేలింది. సహజసిద్ధంగా ఉన్న ఆ నిక్షేపాలను వెలికి తీసేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని తవ్వి తీసే దేశాల్లో భారతదేశం కూడా ఒక ఒకటి. ఇక మార్చి 31, 2025 నాటికి, భారతదేశం యొక్క మొత్తం బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులు. అందులో చాలా భాగం కర్ణాటక నుంచే వస్తుంది. ఇక ప్రస్తుతం ఏపీలో కూడా బంగారపు గనులు బయటపడ్డాయి. కాస్త రాయలసీమ కు వెళ్తే.. అత్యంత విలువైన బంగారం నిక్షేపాలను మన నేలలో ఉన్నట్లు తేలింది. మనలో చాలా మందికి.. మన రాష్ట్రంలో బంగారం గనులు ఉన్నాయా..? ఎక్కడా ఉన్నాయి..? అనుకుంటున్నారా..? అవును మన రాయలసీమలోనే.. అందులోనూ తీవ్ర కరవు పీడిత ప్రాంతమైన కర్నూలు జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం తేల్చి చెప్పింది.

బంగారం ఉత్పత్తులోకి ఏపీ..

భారతదేశ బంగారం ఉత్పత్తి పటంలో ఆంధ్రప్రదేశ్‌ త్వరలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో తో పాటు ఆస్పరి మండలంలోనూ బంగారం గనులు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం తేల్చి చెప్పింది. తుగ్గలి మండలం జొన్నగిరి పగిడిరాయి. ఎర్ర రెవెన్యూ పరిధిలోని 155 ఎకరాల భూమిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారం గనులు ఉన్న ఈ ప్రాంతంలో బంగారం వెలికితీత కోసం 320 కోట్ల రూపాయల విలువైన యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రాంతం తూర్పు బ్లాగులో భూమి అడుగున సుమారు 180 మీటర్ల లోతులో 6.8 మిలియన్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ఇక ఇది ఇలా ఉండగా.. కప్పట్రాళ్ల లాంటి ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉన్నట్లు సాక్షాత్తు పార్లమెంటులోనే కేంద్రం మంత్రి ప్రకటించడం చూస్తే నిజంగా కర్నూలు జిల్లాకు మంచి రోజులు వచ్చాయా అనిపిస్తుంది.

డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్..

ఇక డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, భారతదేశంలో బంగారు అన్వేషణకు BSEలో లిస్టింగ్ పొందిన మొట్టమొదటి మరియు ఏకైక కంపెనీగా గుర్తింపు పొందింది. 2003లో స్థాపించబడిన ఈ సంస్థ అన్వేషణ రంగంలో విశేష అనుభవం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి, ఎర్రగుడి మరియు పగదిరాయి గ్రామాల సమీపంలో ఈ గని ఉంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతోంది, దీనిలో DGMLకు వాటా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు కూడా త్వరలో లభించనున్నాయి.

ఏటా 1,000 టన్నుల దిగుమతి..

ప్రస్తుతం భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు 1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేస్తోంది. బంగారం భారతీయుల కోసం కేవలం ఆభరణం మాత్రమే కాదు, పెట్టుబడికి, సంపద రక్షణకు, పండుగలు, వివాహాల వంటి ముఖ్య సందర్భాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే విలువైన లోహం. చమురు తర్వాత భారతదేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో బంగారం రెండవ స్థానంలో ఉంది. అంత పెద్ద స్థాయిలో దిగుమతులు చేయడం వల్ల ప్రభుత్వ విదేశీ మారక నిల్వలపై కూడా భారం పడుతుంది.

కొత్త బంగారు గనులు..

ఈ పరిస్థితిలో, దేశీయంగా కొత్త బంగారు గని ఉత్పత్తి ప్రారంభం అవ్వడం వలన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. ఇక దేశంలో బంగారం ఉత్పత్తి పెరగడం వల్ల దిగుమతి బిల్లు తగ్గుతుంది. ఇది దేశానికి విలువైన విదేశీ మారకాన్ని ఆదా చేస్తుంది. అదనంగా, స్థానికంగా ఉత్పత్తి అయ్యే బంగారం వల్ల దేశీయ మార్కెట్‌లో ధరలు కొంత స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. దీని వల్ల వినియోగదారులు మరియు ఆభరణాల తయారీదారులు లాభం పొందవచ్చు.

ప్రాజెక్టు విజయవంతం అయితే..!

ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, భారతదేశంలో మరిన్ని ప్రైవేట్ రంగ మైనింగ్ ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతుంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు భారతీయ మైనింగ్ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపవచ్చు. దీని వలన మైనింగ్ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, భారతదేశం బంగారం ఉత్పత్తిలో ప్రపంచస్థాయిలో పోటీ పడే స్థాయికి చేరే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *