జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాలుగు వరుస ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. తొలిసారిగా విజయ తీరాలకు చేరుతున్నాడు. పట్టుదలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయి.
ఇక విషయంలోకి వెళ్తే…
వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం యూసుఫ్‌గూడ హైదరాబాద్. నవీన్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్, స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య వర్ష యాదవ్, కుమారుడు అన్ష్ యాదవ్ ఉన్నారు.
రాజకీయాల్లోకి అందరు రాలేరు.. ఎక వేల వచ్చిన గెలవలేరు.. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అంత ఆశామాషి అయితే కాదు. ఇందుకు పవన్ కల్యాణ్ ను తీసుకుంటే.. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి దాదాపు 14 సంవత్సరాలు పట్టింది. రాజకీయంలోకి వచ్చి నేరుగా ఎన్నికలకు వెల్లకపోయినా.. ఎమ్మెల్యే అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది. అందుకు ఆ నేత ప్రజల్లో మెదగాలి.. ప్రజల మధ్యలో కలిసి నడవాలి.. ఇదే నాయకుడికి ఉన్న లక్షణం. అలాంటి వాళ్లో కొందు మాత్రమే చోటు సంపాదించుకుంటారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఓ నాయకుడు ఓటమిని ఎలా ఓ మెట్టుగా మార్చుకోవాలో చెప్పాలంటే.. అందుకు బెస్ట్ ఉధాహరణ జూబ్లీహిల్స్ లో గెలినినవల్లాల నవీన్ యాదవ్ పేరు చెప్పుకోవాలి.
16 ఏళ్ల రాజకీయ జీవితం..
16 ఏళ్ల రాజకీయ జీవితం.. పదేళ్ల కాలంలో నాలుగు వరుస ఓటములు.. అయినా.. నవీన్ యాదవ్ ఏనాడు రాజకీయాలను వదులుకోలేదు. తన నియోజకవర్గంపై ఆయనకున్న నిబద్ధత, ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఆయనను తిరిగి తిరిగి బరిలోకి దిగేలా చేసింది. మన శ్రీశ్రీ చెప్పినట్లుగా.. కుదిరితే పరిగెత్తు… లేకపోతే నడువు… అదీ చేతకాకపోతే పాకుతూ పో… కనీ ఓడిపోతం అని భయంతో ఆగిపోకు.. ఎడుస్తు ఇంట్లో కూర్చోకు అన్న వాక్యా సరిగ్గా నవీన్ యాదవ్ కు దక్కుతుంది. అందుకే ఓ సంకల్పం చేసుకున్నాడు.. గెలవడం ముఖ్యం కాదు.. ప్రజల గుండెల్లో చోటు తెచ్చకోవడం ముఖ్యం అని.. అప్పుడు ఆలోచన వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకం గెలుచుకోవాలంటే సేవ చేయాలని భావించిన నవీన్ యాదవ్ ‘నవ యువ ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో గెలవాలంటే ముందు ప్రజల గుండెల్లో చోటు దక్కాలని ఆయన అర్థం చేసుకున్నాడు. ఓటములనే ఒక్కొక్క మెట్టుగా చేసుకొని ఆ ప్రజలే విజయతీరాలకు తీసుకెళ్లారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం ఖాయం చేసుకున్నాడు. 8 రౌండ్లు పూర్తయ్యే సరికి 20 వేల మెజార్టీ దాటి గెలుపుకు దగ్గరయ్యాడు.
ఓటమితో మొదలైన రాజకీయ జీవితం..
2009లో ఎంఐఎం తరఫున యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా మొదటి పోరాటం.. మొదటి అడుగులోనే ఓటమి! చాలామంది ఇక్కడే ఆగిపోతారు. తెలుగు దేశం అభ్యర్థి మురళీ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ నవీన్ ఆగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన 41,656 ఓట్లు (25.19%) సాధించి, టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ తర్వాత రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటారు. కానీ విజయం మాత్రం అందలేదు. 2015లో రహ్మత్‌నగర్ డివిజన్ నుంచి మళ్లీ పోటీ… మరొక ఓటమి. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా మరో సారి ప్రయత్నం.. 18,817 ఓట్లు వచ్చినా గెలుపు మాత్రం దూరంగానే ఉంది. 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరారు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం – 16 ఏళ్ల పోరాటానికి దారులు మార్చింది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆయనకే టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఆయన పేరు మారుమ్రోగిపోయింది.
ఉప ఎన్నికల్లో.. విజయం..
ఇక ఈ ఏడాది జూన్‌లో మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ యాదవ్.. విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో ముందజలో నిలిచాడు. నియోజకవర్గంపై ఆయనకున్న దశాబ్దాల పట్టు, కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ప్రజాభిమానం ఆయనను ఈ చారిత్రక విజయం వైపు నడిపించాయి. నాలుగు ఓటముల తర్వాత చివరకు విజయ తీరాలకు చేర్చాయి. రేపు అసెంబ్లీలో అధ్యక్ష అని మాట్లాడనున్నారు.