- జాక్ పార్ట్ కొట్టిన భారత్..
- సముద్ర గర్భంలో.. సహజ వాయువుల నిక్షేపాలు..
- ఇంధన రంగంలో.. భారత్ కొత్త ఆవిష్కరణ..
- ఇక నుంచి సహజ వాయువు విషయంలో ఇతర దేశాలపై ఆదారపడని భారత్..
- అండమాన్ సముద్రంలో సహజ వాయువు..
- ఆయిల్ ఇండియా అన్వేషణ సఫలం..
- వెలికి తీసిన గ్యాస్‌లో 87 శాతం మీథేన్ ఉన్నట్టు నిర్ధారణ..
- ఈ ప్రాంతంలో భారీగా నిక్షేపాలు ఉంటాయని నిపుణుల అంచనా..
- రూ.3,200 కోట్లతో ఓఎన్‌జీసీ, ఓఐఎల్ సంయుక్త అన్వేషణ..
- సముద్ర గర్భంలో.. సహజ వాయువుల నిక్షేపాలు..
భారత ఇంధన రంగంలో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) అండమాన్ సముద్ర గర్భం లో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ కనుగొనిక భారత ఎనర్జీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.అండమాన్ దీవుల తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఓఐఎల్ అన్వేషణ చేపట్టింది. ఆ తవ్వకాలలో గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. ఒక అన్వేషణాత్మక బావిలో 295 మీటర్ల లోతులో సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

ఇక విషయంలోకి వెళ్తే..
భారతదేశ ఇంధన రంగానికి ఒక భారీ శుభవార్తను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. అండమాన్ బేసిన్‌లో భారీ మొత్తంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు తెలిపారు. ఈ ఆవిష్కరణతో అండమాన్ సముద్రంలో శక్తి అవకాశాల మహాసముద్రం తెరుచుకుందని కేంద్రమంత్రి అభివర్ణించారు. ఈ సందర్భంగా అండమాన్ సముద్రంలో ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు తేలిందని హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఆయిల్ ఇండియా అన్వేషణ సఫలం..
దేశంలో మొదటిసారిగా అండమాన్ సముద్రంలో “సహజ వాయువు” నిక్షేపాలను కనుగొంది. అండమాన్ దీవుల తూర్పు తీరం నుంచి 9.20 నాటికల్ మైళ్లు, 17 కిలోమీటర్ల దూరంలో.. 295 మీటర్ల నీటి లోతులో తవ్విన శ్రీ విజయపురం 2 బావిలో ఈ సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో గ్యాస్ ఉనికి బయటికి వచ్చిందని పేర్కొన్నారు. పరీక్షల్లో సేకరించిన నమూనాలను నౌక ద్వారా కాకినాడకు తీసుకువచ్చి పరీక్షించగా.. అందులో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలిందని కేంద్రమంత్రి వివరించారు.

2 లక్షల కోట్ల లీటర్ల చమురు..
దీంతో ఈ ప్రాంతంలో 2 లక్షల కోట్ల లీటర్ల భారీ చమురు నిల్వలు ఉండే అవకాశాన్ని మంత్రి అంచనా చేశారు. ఇక సముద్రంలో మయన్మార్ నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్న ఈ చమురు, గ్యాస్ బెల్ట్‌లో భారత్‌కు ఒక చారిత్రక మైలురాయి అని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు విదేశాల నుంచి భారీగా చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్‌కు ఒక జాక్‌పాట్ లాంటి వార్త అనే చెప్పాలి.
20 ట్రిలియన్ డాలర్ల లాభం..
ఈ ఆవిష్కరణతో అండమాన్ బేసిన్‌లో హైడ్రోకార్బన్‌లు ఉన్నాయని ఎప్పటి నుంచో మనం నమ్ముతోంది నిజమైందని హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేషనల్ డీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భారత దేశం ఈ సహాజ వాయువులను వెలికి తీస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 20 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. దిగుమతులపై ఆధారపడకుండా, ఇంధన భద్రతను పెంచడంతో పాటు చమురు, గ్యాస్ ఉత్పత్తిలో స్వావలంబనకు ఈ నిక్షేపాలు సహాయపడుతాయి. ఈ నాచురల్ గ్యాస్ నిక్షేపాలను గుర్తించడానికి ముందు జూన్ నెలలో, హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. అండమాన్ లో గయానా పరిణామంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నట్లు చెప్పారు.

చారిత్రక మైలురాయి..
ఇక ఈ సరికొత్త సహజ వాయువు నిల్వలను కనుగొని.. హైడ్రోకార్బన్ నిల్వలను పూర్తిగా వినియోగించుకోవడానికి దేశీయ, ప్రపంచ స్థాయి నిపుణులతో సమన్వయం చేసుకుంటున్నట్లు హర్దీపీ సింగ్ పూరీ వెల్లడించారు. రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని డీప్‌వాటర్ అన్వేషణ బావుల తవ్వకాలకు ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. భారతదేశ అమృత కాలం ప్రయాణంలో ఈ సహజ వాయువు ఆవిష్కరణ ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని కేంద్రమంత్రి నొక్కి చెప్పారు.
రూ.3,200 కోట్లతో ఓఎన్‌జీసీ, ఓఐఎల్ సంయుక్త అన్వేషణ..
ఈ అంచనాల నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఓఐఎల్ కలిసి రూ.3,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంతంలో విస్తృత అన్వేషణ కార్యక్రమాలను చేపట్టాయి. అండమాన్‌లో చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉండే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజా ఆవిష్కరణ ఈ అంచనాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.