విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) రష్మిక (Rashmika) డేటింగ్ (Dating) అంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నా వీరు మాత్రం స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా రష్మిక చేసిన పోస్టు వీరిద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేలా ఉంది. రష్మిక తన మైసా (Misa) సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి స్టార్ హీరోలు విషెస్ చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ చెప్పారు. ఇది అద్భుతంగా ఉంటుంది అని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దానికి రష్మిక విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ రిప్లై ఇచ్చింది.
విజ్జూ ఇది నీ కోసమే…
‘విజ్జూ ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా’ అంటూ లవ్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఆమె చేసిన ఈ పోస్టు కాస్త వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండను విజ్ఞ అంటూ పిలవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆమె పోస్టు చూసిన వారందరికీ.. ఆమె విజయ్ ను లవ్ చేస్తోందని కన్ఫర్మ్ చేసినట్టే అంటున్నారు. విజయ్ గర్వపడేలా చేయాల్సిన అవసరం ఆమెకు ఏముంది.
రష్మిక, విజయ్ రిలేషన్…
వీరిద్దరి మధ్య ఏదో ఉంటేనే కదా ఇలాంటి రిప్లై ఇస్తుంది అని అంటున్నారు. ఏదేమైనా రష్మిక, విజయ్ తమ రిలేషన్ ను ప్రకటించకుండా.. చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాను (Lady oriented movie) చేయడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో వయోలెంటిక్ పాత్రలో రష్మిక నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Suresh