ప్రస్తుతం ఈ భూప్రపంచంలో మనవాలు తర్వాత అంతటి ఆకారంతో.. ఉన్న వ్యక్తులు ఎవరు అంటే అది కృత్రిమ మనుషులే (Artificial people) అని చెప్పాలి. అవును మనతో పాటు.. ప్రస్తుతం ప్రపంచంలో రోబోల యుగం నడుస్తుంది. ఎక్కడు చూసిన రోబోలే కంటపడుతున్నాయి. స్కూల్ లో రోబోలు, కిచెన్లో రోబోలు, కార్ డ్రైవింగ్ లోనూ రోబోలే, ఆకరికి బాక్సింగ్ లో కూడా రోబోలు కనివిందు చేస్తున్నాయి. టెక్నాలజీతో మనుషులతో సెక్స్ చేసే రోబోలను సైతం తయారు చేశారు. ఇప్పుడు టెక్నాలజీ ఇంకాస్తా అప్డేట్ అయ్యింది. దీంతో ఏకంగా.. పిల్లల్ని కనే రోబోలను తయారు చేస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు.
ఇక విషయంలోకి వెళ్తే..
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (artificial intelligence, (AI), రోబోటిక్స్ (Robotics), బయోటెక్నాలజీ (Biotechnology) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఒకప్పుడు మనం కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేవాళ్లం.. కానీ ఇప్పుడు అవే నిజం చేస్తున్నాయి. అటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణే “పిల్లల్ని కనే రోబో”. అవును మీరు విన్నది నిజమే. నిజంగా పిల్లల్ని కనే రోబోలు రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై చైనాలో (China) వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సింగపూర్‌లోని (Singapore) నాన్యాంగ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పరిశోధక బృందం ఈ రోబోను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉంది.

ప్రస్తుత టెక్నాలజీతో.. ఈ సాంకేతికత ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ రోబోలో ఒక కృత్రిమ గర్భాశయం (artificial uterus) ఉంటుంది. అందులో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ను నింపి, గర్భంలో శిశువు పెరుగుదలకు అవసరమైన సహజ వాతావరణాన్ని సృష్టిస్తారు. తల్లి గర్భంలో శిశువుకు అందే అన్ని పోషకాలు, తల్లి గర్భంలో శిశువుకు అందే అన్ని పోషకాలు, ఆక్సిజన్, రక్షణ ఈ రోబోలోని ట్యూబ్స్ , న్యూట్రియెంట్ సప్లై సిస్టమ్ (Nutrient Supply System) ద్వారా అందుతాయి. తల్లి గర్భంలో శిశువు 9 నెలల కాలంలో ఎలాగైతే పెరుగుతాడో, ఈ రోబోలో కూడా అదే విధంగా పెరిగి దాదాపు 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇది ప్రారంభ దశలో ఉన్నందున, ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
