వైస్ ప్రెసిడెంట్ గా చిరు..?
మెగా ఫ్యామిలీ కి కేంద్రం బంపర్ ఆఫర్..
దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగా స్టార్..
భారత దేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి
నెక్స్ట్ ఉప రాష్ట్రపతిగా చిరు నేనా..?
భారత ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా (resignation) లేఖను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ముకు (Draupadi’s Murmu) పంపించారు, ఆమె దానిని ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2027 ఆగస్టు వరకు ఉంది. అయితే, మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉప రాష్ట్రపతిగా చిరు..?
దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే అంశం ఉత్కంఠ రేపుతుంది. దీంతో తాజాగా ఉప రాష్ట్రపతి స్థానంలో.. తెరపైకి టాలీవుడ్ స్టార్ హీరో మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)పేరు వినిపిస్తుంది. అవును నిజంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి (Former Vice President) రేసులో.. మాజీ కేంద్ర మంత్రి, నటుడు చిరంజీవి పేరు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన బీజేపీ (BJP) లో భాగంగా ఉండటం, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ ను సౌత్ అంతా వాడుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇక రాబోయే తమిళనాడు ఎన్నికల్లో.. పవన్ కు ఆక్కడి కమలం భాద్యతలు ఇచ్చే వ్యూహంలో కేంద్ర బీజేపీ ఉన్నట్లు సమాచారం. దీంతో తన అన్న చిరంజీవికి ఉన్నత పదవి ఇస్తే.. పవన్ ను బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుకోవచ్చనే వ్యూహం కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎన్నికోవాలంటే.. ఇలా జరుగుతంది ముందుగా ‘ఎలక్టోరల్ కాలేజీ’ (Electoral College)లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికలో ఓటు వేస్తారు. అయితే ఈ ఎలక్షన్‌కి 395 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం NDAకి 426 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా బీజేపీకి 341 మంది ఉన్నారు. కాంగ్రెస్‌కి 126 మంది సభ్యుల బలం ఉంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే NDA సులభంగా విజయం సాధించనుంది.
అన్ని మంచి సంబంధాలే..
ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయనకు కేంద్ర ప్రభుత్వం తో మంచి సంబంధాలు ఉన్నాయి. అంటూ కాంగ్రెస్, ఇటు బీజేపీ వంటి రెండు జాతీయ పార్టీలతో చిరంజీవికి సంసంబాదాలు ఉన్నాయి. దీంతో ఆయన పేరును గానీ బీజేపీ ప్రకటిస్తే.. అందుకు కాంగ్రెస్ కూడా అడ్డుపడకపోవచ్చు. కారణం చిరంజీవి స్వయానా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటం.. అక్కడ ఆయన పాత మిత్రులు ఉండటం ఇందుకు కలిసోచ్చి అవకాశం. ఇక ఇప్పటికే చిరంజీవికి కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం పుష్కలంగా ఉండటం ఇందుకు బాగా కలిసోచ్చే అంశం. ఇక కేంద్ర మంత్రిగా పనిచేశాక రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేశారు.
విశ్వంభర సినిమాతో బిజీ బిజీ
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి (Anil RavipudiC) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే విశ్వంభర (Viśvambhara) అనే భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా లైనప్లో కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ, కేంద్ర స్థాయిలో పౌర రాజ్యాంగ హెూదా లాంటి కీలక పదవి చిరు ఒప్పుకుంటారో లేదో అనేది ఆసక్తికరమైన విషయం. చిరంజీవి వైపు బీజేపీ చూపు తిప్పినట్లు కొన్ని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిస్తే, దక్షిణాదిలో బీజేపీకి ప్రత్యేక శక్తినిచ్చే అవకాశముంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.
Suresh