Mega family's young hero Sai Durga Tej's wedding news

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై ఎంతోకాలంగా సాగుతున్న ఊహాగానాలకు స్వయంగా ముగింపు పలికారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు.

ఇక విషయంలోకి వెళ్తే..

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ‘వచ్చే ఏడాదిలోనే నా వివాహం ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

పెళ్లిపై స్పందించిన సాయి దుర్గ తేజ్…

టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ తన వివాహంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎప్పటినుంచో ఆయన పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త సంతోషాన్నిచ్చింది. “వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది” అని సాయి దుర్గ తేజ్ తెలిపారు. తనకు మంచి సినిమాలు, చక్కటి జీవితం ప్రసాదించిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చినట్లు చెప్పారు. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని, దీనిపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. పాన్-ఇండియా స్థాయిలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అనే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *