తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక వాడ అయిన పాశమైలారం లో సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ మృతుల సంఖ్య అంతకు అంతకు పెరుగుతు పొతుంది.
క్షణం క్షణం కు పెరుగుతున్న మృతుల సంఖ్య..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కి చేరినట్లు తెలుస్తుంది. ఇక మరిని మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్‌బీమ్‌లు విరిగి, కుప్ప కూలిపోవడంతో నష్టతీవ్రత పెరిగిందని వెల్లడించారు.
100 మీటర్లు ఎగిరిపడిన మృతదేహం..
పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలో సిగాచీ రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే, ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఈ భారీ విస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. సమీపంలోని మరో భవనానికి కూడా బీటలు వారాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుని భయానక వాతావరణం నెలకొంది. ఇక మరో వైపు ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు… మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్‌ల ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
శిథిలాల కిందే మృతదేహాలు…
ఇక శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
పేలుడికి కారణం ఇదేనా..!
ఇక పేలేడుకు కారణం.. బ్లో ఎయిర్ హ్యాండ్లర్‌ను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యమేనని అంచనా వేస్తున్నారు. అందులో దుమ్ము పేరుకుందని, అందుకే డ్రయ్యర్‌లో ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారితీసి ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెబుతున్నారు.
Suresh