Maldives sinking into the sea..!

భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారతదేశం నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు?

ఇక విషయంలోకి వెళ్తే..

కొత్తగా పెళ్లి చేసుకున్న చాలా మంది నూతన దంపతుల హనీమూన్ స్పాట్, డైవింగ్ ఔత్సాహికులకు ఒక ప్రధాన గమ్యస్థానం మాల్దీవులు. ఈ అందమైన ప్రాంతం త్వరలో మాయం కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం తీరాలను తాకుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ సముద్ర మట్టాల కారణంగా ఈ 1,200 పగడపు దీవులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మాల్దీవుల ఉనికి మాత్రమే కాకుండా తువాలు, కిరిబాటి, మార్షల్ దీవులు వంటి చిన్న ద్వీప దేశాల ఉనికి కూడా ముప్పులో ఉందని అంచనా వేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది.

సాధారణంగా ప్రపంచంలో ఉన్న దేశాలు సముద్రమట్టానికి 840 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ మాల్దీవులు మాత్రం 1.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్న సమాచారం ప్రకారం 2060 లేదా 2080 సంవత్సరానికి మాల్దీవులు 90 శాతం సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మాల్దీవులు దేశంలో బోర్వెల్ వేస్తే ఉప్పునీరు బయటకు వస్తుంది. సముద్రపు నీరు పెరుగుతున్న కొద్దీ భూమిలోకి ఉప్పునీరు కలిసిపోతుంది. దీంతో ఇవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. వాతావరణ కాలుష్యం.. గ్లోబలైజేషన్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంచుకొండలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టం మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇలా మరో 50 ఏళ్ల వరకు మరింతగా పెరిగి మాల్దీవులు దేశం సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం పర్యాటకంలో మాల్దీవులలో 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది. బీచ్లు లేకుండా, రిసార్ట్లు మూసివేయబడతాయి. దీంతో ఉద్యోగాలు పోతాయి.

సముద్ర మట్టాలు ఎంత పెరిగాయో తెలుసా..?

నిజానికి మాల్దీవులు ఇప్పటికి ఇప్పుడు మునిగిపోవని అంటున్నారు. కానీ పెరుగుతున్న మహాసముద్రాల నీటి మట్టాల కారణంగా దానికి ముప్పు పెరుగుతోందని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1900 నుంచి ప్రపంచ సముద్ర మట్టాలు దాదాపు 20 సెం.మీ. పెరిగాయి. మంచుకొండలు కరుగడం, వెచ్చని నీటి విస్తరణ కారణంగా ఇటీవల ఈ రేటు సంవత్సరానికి 4 మి.మీ. పెరిగింది. సముద్రానికి 2.4 మీటర్లు ఎత్తైన ప్రదేశంగా ఉన్న మాల్దీవులకు.. చిన్న శాతం నీటి పెరుగుదల కూడా విపత్తుకు దారితీస్తుంది. 2050 నాటికి 30-50 సెం. మీ. పెరుగుదల ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. 2100 నాటికి సముద్రం 77% భూమిని ముంచెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మాల్దీవులు కొత్త ప్రయత్నం..?

తన దేశం సముద్రంలో మునిగిపోతుంది అని తెలిసకా.. ఆ దేశం తమ మనుగడను కాపాడుకునేందుకు వినూత్న ప్రయత్నాలను సోధిస్తుంది. ఇక ఈ సమస్యను అధిగమించడానికి మాల్దీవులు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. దీవులను పైకి లేపడానికి ఇసుకను పంపింగ్ చేస్తోంది. సముద్ర గోడలను నిర్మిస్తోంది, అలాగే తేలియాడే నగరాలతో ప్రయోగాలు చేస్తోంది. మాలే సమీపంలోని మానవ నిర్మిత ద్వీపమైన హుల్తుమలే 100,000 మందికి నివాసంగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎత్తులో ఉంది. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు సౌరశక్తితో పనిచేసే రిసార్ట్లు వంటి “వాతావరణ అనుకూల” పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

ఫిజీలో భూమిని కొన్న కిరిబాటి..?

ఈ సమస్య కేవలం మాల్దీవులకే పరిమితం కాలేదు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల అంతటా ఉన్న చిన్న దీవులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. 11 వేల మంది నివసించే తువాలులోని తొమ్మిది దీవులు 2050 నాటికి నివాసయోగ్యంగా మారనున్నాయి. కిరిబాటి అధ్యక్షుడు ఇప్పటికే ఫిజీలో భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. మార్షల్ దీవులు అమెరికా అణు పరీక్షల నుంచి రేడియోధార్మిక పతనంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమస్య సముద్ర మట్టాలు పెరగడం వల్ల మరింత తీవ్రమవుతుందని అంచనా.

వీళ్లకు భూమి లేకపోతే ఏం జరగబోతుంది..?

ప్రస్తుతం మాల్దీవులు సముద్రంలో మునిగిపోతే.. ఇక్కడి ప్రజలు ఏ దేశానికి వలస వెళ్తారు? అన్న చర్చ సాగుతోంది. మాల్దీవులు దేశంలో ఎక్కువగా ముస్లింలు ఉంటారు. మాల్దీవులలోని 540,000 మంది నివాసితులు భారతదేశం, శ్రీలంక లేదా ఆస్ట్రేలియాలోని ఎత్తైన ప్రాంతాలలో ఆశ్రయం కోరుతూ శరణార్థులుగా మారవచ్చు. ఇదే కాకుండా.. కొందరు ఇస్లామిక్ దేశానికి వలస వెళ్తున్నారని అంటుండగా.. మరికొందరు మాత్రం ఈ దేశానికి భారత్ చేయూతను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఆసియాలో చాలా దేశాలకు భారత్ ఎన్నో రకాలుగా సహాయంగా నిలుస్తోంది. దక్షిణాన ఉన్న శ్రీలంకలో సంక్షోభం ఏర్పడితే ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలల కిందట భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవులు ప్రభుత్వంలోని కొందరు మంత్రులు వ్యతిరేక వాక్యలు చేశారు. భారత్తో తమకు ఎలాంటి అవసరం ఉండదని అన్నారు. కానీ ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షదీప్ వెళ్లడంతో.. భారత్ నుంచి పర్యాటకల సంఖ్య విపరీతంగా తగ్గింది. అంతేకాకుండా కొన్ని రకాల వస్తువుల ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో మాల్దీవులు దేశ ప్రధానమంత్రి… నరేంద్ర మోడీ కాళ్ళ బేరానికి వచ్చిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *