ప్రస్తుతం సౌత్ ఇండియాలో (South India) చాలా వరకు సినిమా హవా తగ్గిపోయింది. ఇటీవలే కూలి, వార్ 2 వచ్చినప్పటికి.. అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక కంటెంట్ ఉంట్టే చిన్న సినిమాలు కూడా.. భారీ విజయం సాధిస్తాయి అనడానికి ఈ సినిమానే ఉదహారణ.
ఇక కాస్త బాక్సాఫీస్ లోకి వెళ్తే..
ఇటివలే ఓ మలయాళం సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం ‘లోకా : చాప్టర్-1’. (Kotha Loka) డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్‌తో పాటు నెక్లెన్, శాండీ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రం విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందని చెప్పుకుంటున్నారు.
మొన్నటిదాకా మీడియా సర్కిల్స్ లోనూ పెద్దగా బజ్ లేని సినిమా కొత్త లోక. కానీ ఇప్పుడు సరి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ (Kotha Loka) మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద దూసుకెళ్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా రూపొందిన ఈ ఫాంటసీ హారర్ డ్రామాలో కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) లీడ్ రోల్ పోషించించారు. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కొత్త లోక చిత్రం విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ మంచి వసూళ్లను రాబడుతుంది. ఒక చిన్న సినిమా వంద కోట్ల గ్రాస్ దిశగా అడుగులు వేయడం మల్లువుడ్ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇంత వేగంగా హండ్రెడ్ క్రోర్స్ అందుకున్న వాటిలో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుంది. మమ్ముట్టి భీష్మ పర్వాన్ని ఇంత తక్కువ గ్యాప్ లో క్రాస్ చేయడం ఎవరూ ఊహించలేదు. కేరళలో లోక స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.
ఇక కల్యాణి ప్రియదర్శన్ .. 2017లోనే వెండితెరపైకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తనకి నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఇంతవరకూ 15 సినిమాలు చేసినప్పటికీ, అసలైన హిట్ ఈ సినిమాతోనే పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తండ్రి ప్రియదర్శన్ గొప్ప దర్శకుడు అయినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటూ అడుగులు వేస్తోంది. అందువల్లనే ఆమె కెరియర్ కాస్త స్లోగా ఉందేమో అని కూడా అనిపించకమానదు. అలాంటి కల్యాణికి ఇప్పుడు ఒక ఒక భారీ హిట్ తగిలిందనే అనుకోవాలి. ఆ సినిమా పేరే ‘లోకా: చాప్టర్ 1- చంద్ర’. మొత్తానికి మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది మరో హిట్‌ను తాన ఖాతాలో వేసుకుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.