ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, అగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అరుగురు ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేశంలో వరుస రోడ్డు ప్రమాదలు మరువక ముందే తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం హావ్రా రూట్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. లాల్‌ఖదన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 6 మంది మరణించినట్లు, మరో 25 మందికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రైల్వే అధికారుల నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇక విషయంలోకి వెళ్తే…
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని లాల్బాదన్ సమీపంలోని హౌరా మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ఒక సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రమాద తీవ్రతతో అనేక రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు గాయపడి ఉండవచ్చని సమాచారం. కానీ ఇంకా గాయపడిన వారిపై సంఖ్యపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సమాచారం ప్రకారం.. కోర్బా ప్యాసింజర్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి కోచ్, గూడ్స్ రైలు బోగీపైకి ఎక్కినట్లు ఘటనా స్థలం నుండి వచ్చిన వీడియోలలో కనిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.