Major road accident in Uttarakhand.. Badrinath pilgrims' bus plunges into Alaknanda river

దేవ భూమిలో..మృత్యు ఘోష..

దేవభూమి (Devbhumi) ఉత్తరాఖండ్ (Uttarakhand) వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రదేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలే కాక… హిందువులు అతి పవిత్రంగా భావించే శివ, నారాయణ కొలువైన పుణ్య భూమి ఈ ఉత్తరాఖండ్. కాగా గత కొంత కాలంగా… అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసొద్దామని వెళ్తున్నా టూరిస్టులు వరుస ప్రమాదాలకు గురై మృతి ఓడిలోకి చేరుతున్నారు. ఇక తాజాగా అలా వెళ్లిన టూరిస్టులు (Tourists) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయారు.

వరుస ప్రమాదాలతో హడలెత్తిపోతున్న యాత్రికులు

ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ (Rudraprayag) జిల్లాలో ఘోల్తిర్ ప్రాంతంలో దాదాపు 18 మందితో వెళ్తున్న బస్సు అలకనందా నదిలో పడిపోయింది. ఇక ఈ బస్సు రుద్రప్రయాగ్‌ నుంచి బద్రీనాథ్‌ వైపు వెళ్తున్నట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగి కొంతమంది ప్రయాణికులను రక్షించింది. అయినప్పటికీ కనీసం 10 మంది వరకు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అలకనంద నది (Alaknanda River) పొంగిపొర్లుతుండటంతో గల్లంతైన ప్రయాణికుల ప్రాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. SDRF, NDRF బృందాలు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బస్సు గార్డ్రేల్స్‌ను ఢీకొని నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌తో సహా బస్సులోని దాదాపు 8 మందిని రక్షించారు. అయితే కొండ అంచునుంచి బస్సు నదిలో పడిపోయినప్పుడు అందులో 20 మంది వరకు ఉన్నారని వారు చెబుతున్నారు.

టెర్రర్ రోడ్లు గా మారిన బద్రీనాథ్ మార్గాలు

ఇక పోలీసుల వివరాల ప్రకారం.. బస్సు కొండపైకి వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో నుంచి వెలికితీసిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇక నదిలో గల్లంతైన వారికోసం ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *