Varanasi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఎవరూ ఊహించని బిగ్ సర్ ప్రైజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూసిన బెస్ట్ మూమెంట్‌ను దర్శకధీరుడు రాజమౌళి మరింత బెస్ట్‌గా అందించారు. ‘GlobeTrotter’ అంటూ మొదటి నుంచి హైప్ ఇచ్చిన రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రుద్ర, గ్లోబ్ ట్రాటర్ అంటూ పలు పేర్లు వినిపించినా ఎక్కువ మంది ఊహించిన సాక్షాత్తూ పరమ శివుడే కొలువైన పుణ్యక్షేత్రం పేరును తన మూవీకి పెట్టారు జక్కన్న.
ఇక విషయంలోకి వెళ్తే..
ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న SSMB-29 టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ప్రజెంట్ అందరి
కళ్లు మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ (Globe Trotter Event)పైనే ఉంది. హైదరాబాద్ శివారులో అత్యంత గ్రాండ్గా జరిగిన ఈ ఈవెంట్కు అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే టైటిల్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో.. టైటిల్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ మేరకు SSMB-29కు ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్ ఫిక్స్ చెయ్యగా.. గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త వైల్డ్ లుక్స్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ‘వారణాసి’ టైటిల్ గ్లింప్తో పాటు మహేశ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండీగా మారాయి. కాగా.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా పరిచయం చేసి హైప్ పెంచేశారు మేకర్స్.
నందిపై శివునిలా ‘రుద్రుడు’
ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రీ లుక్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన మన జక్కన్న… ఫస్ట్ లుక్‌లో ఇంతకు ముందు చూడని… ఎవరూ ఊహించని లుక్ అందించి ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చారు. మూవీలో ‘రుద్ర’గా మహేష్ కనిపించనున్నారు. నందిపై చేతిలో త్రిశూలంతో మెడలో నంది లాకెట్‌తో ఓ యుద్ధానికి సిద్ధం అనేలా మహేష్ లుక్ ఉంది. రుద్రుడిగా సాక్షాత్తూ పరమశివుడే నేలకు దిగి వచ్చాడా? అనేలా ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
‘GlobeTrotter’ అంటే ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు అని అర్థం. ఇది ప్రీ లుక్ టైంలోనే రివీల్ చేశారు రాజమౌళి. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ముందు నుంచీ రామాయణాన్ని బేస్ చేసుకుని ‘సంజీవని’ అన్వేషణలో దేశ సంచారం చేసే పాత్రలో మహేష్ కనిపిస్తారనే ప్రచారం సాగింది. అయితే, ఫస్ట్ లుక్‌లో మాత్రం రుద్రుడిగా శివుడే దిగి వచ్చాడా అనేలా ఉండడంతో సస్పెన్స్ మరింత రెట్టింపైంది. మరి ఈ ‘వారణాసి’ కథ ఏంటో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.