కొత్త మద్యం దుకాణాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు ఆసక్తికలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15 %, ఎస్సీలకు 10 %, ఎస్టీలకు 5 % రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

ఇక విషయంలోకి వెళ్తే..
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-27 సంవత్సరాలకు గాను రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేసేందుకు ఆబ్కారీ శాఖ గురువారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ప్రస్తుత దుకాణాల లైసెన్సు గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా లైసెన్లు జారీ..
ఆబ్కారీ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఆసక్తిగల వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం అక్టోబరు 23న లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు దుకాణాలను కేటాయిస్తారు. కొత్తగా లైసెన్సులు పొందిన వారు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి తమ దుకాణాలను ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్సుల కాలపరిమితి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.

ఎక్సైజ్ చట్టం 1968 ఏం చెబుతుంది..?
నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా నిర్థారించారు. క్రితంసారి ఇది రూ.2 లక్షలుగా ఉండేది. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు… ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15 %, ఎస్సీలకు 10 %, ఎస్టీలకు 5 % రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ తప్పనిసరి చేశారు.
ఈసారి కూడా ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగించింది. మొత్తం దుకాణాలలో 15 శాతం గౌడ సామాజిక వర్గానికి, 10 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు రుసుమును రూ.3 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. రిజర్వేషన్ కోటాలో దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే, స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
దుకాణాల వార్షిక లైసెన్సు ఫీజును జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షల నుంచి మొదలుకొని, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో గరిష్ఠంగా రూ.1.10 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.
2,620 మద్యం దుకాణాల దరఖాస్తు..

తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2,620 మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే నెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. రెండు సంవత్సరాల కాలానికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. ఇక ఈ దరకాస్తులకు ఏమైనా రిజర్వేషన్ లు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.