భూతల స్వర్గం అయిన జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా (Poonch District) లో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు.

గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ భారీ వరదలకు కొండచరియలు విరిగిపడినగ ఘటనలు చాలా చూశాం. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న చోలన్ కల్సన్ (Solan Kalan) గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. స్థానికంగా ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కొండచరియలు విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించారు. మరో నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. కాగా గాయపడిన క్షతగాత్రులను పూంచ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి వయస్సు 5 ఏండ్లని ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందించాలని అధికారులను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశారు. పూంచ్ జిల్లా కలెక్టర్ వికాస్ కుండల్ (Vikas Kundal), ఎసిఆర్ మహమ్మద్ సయీద్ (Mohammed Saeed) ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన విద్యార్థులకు ఎలాంటి ప్రాణపాయం లేదని, వారు త్వరలోనే కోలుకోవాలని అధికారులు ఆకాక్షించారు. కాగా, ప్రమాదం విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Suresh