KTR to be arrested at any moment for the investigation of this car race case?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా ఏసీబీ చేర్చినట్లు గతంలోనే చెప్పారు.

ఇక విషయంలోకి వెళ్తే…

తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఎట్టకేలకు ఈ ఫార్ములా -కారు రేసు(E Formula Race) కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి వచ్చింది. ఇగ ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడితోటి విచారణకు అన్ని అడ్డంకులు అయితే తొలగిపోయాయి. ఇగ గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనుందని సమాచారం వచ్చింది. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా ఏసీబీ గప్పట్లోనే చేర్చింది. ఇగ ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ విచారణకు నాలుగు సార్లు కేటీఆర్ హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను కూడా సేకరించారు. ఇగ తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి ఏసీబీ కూడా విచారణ చేయవట్టింది.

10 వారల తర్వాత అనుమతి..

ఇగ కేటిఆర్ ను ప్రాసిక్యూట్ చేసేటందుకు సెప్టెంబర్ 9 న గవర్నర్ కు ఏసీబీ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దాదాపుగా 10 వారాల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇగ ఈ కేసులో ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డీఓపీటీకు కూడా లేఖ వెల్లడించారు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో, చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతో, రాజకీయ వర్గాలలో, పరిపాలనా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే చార్జ్‌షీట్‌తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. మరి చూడాలి కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసు ఏట్ల మలుపు తిప్పనుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *