విజయ్ ని బతికించిన..
విజయ్ దేవరకొండ.. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న మన రౌడీ బాయ్. ఈ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా డీలా పడ్డాయి. ఒక్కొక్కటిగా.. ఫ్లాప్ అవ్వడంతో అసలు విజయ్ కి ఇక హిట్ పడుతుందా అన్న డౌట్ వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో చావో రేవో డిసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కొన్ని వస్తుంటాయి. అలాంటి సందర్భంలో అనుకున్నది సాధించినప్పుడు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు.
ప్రస్తుతం విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
విజయ్ గోడు విన్న వెంకన్న..
గతంలో మీకు నాని నటించిన జెర్సీ సినిమా గుర్తుకు ఉండే ఉంటుంది. వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అయిన నా ఆనందాన్ని తట్టుకోలేకా.. ఒక రైల్వే స్టేషన్ లోకి వెళ్లి చేసే సీన్ ఉంటుంది. అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అలాంటి సీన్స్.. నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం విజయ్ విషయంలో అచ్చం అలాగే జరిగింది. విజయ్ విషయంలో.. హిట్ పడితే తప్ప కెరియర్ ఉంటుందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకమే. అలాంటి సమయంలో.. విజయ్ ని కింగ్డమ్ బతికించింది. నిజంగా సినిమా రిలీజ్ కు ముందు.. విజయ్ అన్న మాటలను ఆ ఎడు కొండలవాడు విన్నాడు.. నేను విన్నాను, నేను ఉన్నాను అని విజయ్ కి ధైర్యం ఇచ్చి.. సినిమా హిట్ కొట్టించాడు. విజయ్ ని మళ్లీ నిలబెట్టాడు.
కింగ్డమ్’ కథ..
కానిస్టేబుల్ సూర్య, విధి నిర్వహణలో భాగంగా అండర్ కవర్ ఆపరేషన్‌లో శ్రీలంక వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అనుకోకుండా చిన్నతనంలో దూరమైన తన అన్నను కలుస్తాడు.. తాను అండర్ కవర్ ఆపరేషన్‌లో వెతుక్కుంటూ వచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, తన అన్న శివనే అని తెలుసుకుంటాడు. అన్నని కాపాడేందుకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం మొదలెడతాడు? అక్కడ అతనికి తెలిసిన విషయాలు ఏంటి? శివ, సూర్య ఎలా దూరమయ్యారు. అన్నను కాపాడడంలో తమ్ముడి ప్రయత్నం సక్సెస్ అయ్యిందా? సూర్య ప్రేమించిన అను ఎవరు? మురుగన్‌కి శివకి సంబంధం ఏంటి? తెలియాలంటే ‘కింగ్డమ్’ మూవీని చూడాల్సిందే..
‘కింగ్డమ్’ కథ
ను ట్రైలర్‌లోనే రివీల్ చేసేశాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అయితే ఎమోషనల్‌గా ప్రేక్షకులను కథలో లీనం చేయడంలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. అన్నదమ్ముల మధ్య సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఫస్టాఫ్ వేగంగా సాగుతుంది. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ కారణంగా కాస్త స్లో అయినట్టు అనిపించినా.. కథ ఎక్కడా పక్కదారి పట్టకుండా తన స్టైల్‌లో తీసుకెళ్లాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.
ఫైనల్ గా..
విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాడు అని చెప్పవచ్చు. “కింగ్‌డమ్” విజయ్ దేవరకొండ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పండగలాంటి సినిమా. అద్భుతమైన నటన, అదిరిపోయే సంగీతం, భారీ విజువల్స్‌తో ఈ చిత్రం ఒక పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. కొన్ని చిన్న లోపాలున్నా, సినిమా ఓవరాల్‌గా ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ ఒక పక్కా హిట్ కొట్టాడని చెప్పవచ్చు.