ప్రముఖ సంగీత దర్శకుడు (Music director) కీరవాణి (Keeravani) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, సినీ గేయ రచయిత శివశక్తి దత్త (Shivashakti Dutta) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడు. శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం (Rajamahendravaram) సమీపంలోని కొవ్వూరులో జన్మించారు.
శివశక్తి దత్తా ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాల ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేశాడు. చిన్న వయస్సు నుండే కళల వైపు మొగ్గు చూపిన శివశక్తి దత్తా తన ఇంటి నుండి పారిపోయి ముంబై సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కళాశాలలో చేరారు. ఇంటి నుండి పారిపోయిన రెండు సంవత్సరాల తర్వాత శివశక్తి దత్తా డిప్లమా అందుకున్నాడు. పట్టా అందుకుని కొవ్వూరుకు తిరిగి వచ్చాడు. కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసేవాడు. తరువాత సుబ్బారావు తన పేరును శివశక్తి దత్తాగా మార్చుకున్నాడు. శివశక్తి దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉండేది. గిటార్, సితార్, హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు.
ఇక శివశక్తి దత్తాకు సినిమాలు మీద ఉన్న ఆసక్తి అతన్ని మద్రాసు (Madras) వరకు వెళ్లేలా చేసింది. మద్రాసు వెళ్లిన తర్వాత ఆయన కొంతకాలం ఇద్దరు దర్శకుల వద్ద పనిచేసి, పిల్లనగ్రోవి అనే సినిమాను పని చేశారు. కానీ ఆ సినిమా ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆ తరువాత మద్రాసు లో ఉన్న తన సోదరుడు విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) తో కలిసి సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత శివశక్తి దత్తాకు తన స్నేహితుడైన సమతా ముఖర్జీ ద్వారా సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో (K. Raghavendra Rao) పరిచయం ఏర్పడింది. రాఘవేంద్రరావు శివశక్తి దత్తాకు తన సినిమాలలో చిన్నచిన్న అవకాశాలు ఇచ్చేవాడు. శివశక్తి దత్తాకు జానకి రాముడు (1988) తో మొదటి అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అంతే కాదు శివశక్తి దత్తా స్క్రీన్‌రైటర్‌గా కూడా పని చేశారు. బాహుబలి 1లోని ‘మమతల తల్లి’, ‘ధీవర’, బాహుబలి 2 (Bahubali 2) లో ‘సాహోరే బాహుబలి’, సవ్యసాచి లో సవ్యసాచి సాంగ్, జాంబీ రెడ్డి లో “మృత్యుంజయ”, పెళ్లిసందD (PeḷlisandaD) లో “హయామ్ వసిష్ఠ” , ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ‘కథానాయక’, ఆర్ఆర్ఆర్ (RRR) లో ‘రామం రాఘవమ్’, హనుమాన్ మూవీ (Hanuman Movie) లో ‘అంజనాద్రి థీమ్ సాంగ్’, సై మూవీలో ‘నల్లా నల్లాని కళ్ల పిల్ల’, ఛత్రపతిలో ‘మన్నేల తింటివిరా’ వంటి పాటలకు లిరిక్స్ రాశారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం, కీరవాణి, కల్యాణి మాలిక్, శివ శ్రీ కంచి.. వృద్దాప్య సమస్యలతో మరణించినట్లు తెలుస్తుంది.
Suresh