Kedarnath doors open after 6 months..! Kedareshwar darshan is coming soon..!

Kedarnath Temple Opening Dates 2026 : 6 నెలల తర్వాత కేదార్నాథ్ తలుపులు ఓపెన్..! కేదారేశ్వరుడి దర్శనం ఎప్పుడంటే..!

కేదార్నాథ్ కు వేళాయే..!

Kedarnath : మహాశివరాత్రి శుభ సందర్భంగా, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత, కేదార్‌నాథ్ రావల్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించారు. షెడ్యూల్ చేసిన శుభ సమయం ప్రకారం, 2026 ఏప్రిల్ 22న ఉదయం 8:00 గంటలకు ఓంకారేశ్వరుడు కొలువుదీరిన కేదార్‌నాథ్ తలుపులు సాధారణ ప్రజల కోసం తెరవనున్నారు. తేదీ నిర్ధారించిన వెంటనే, అధికారులు, ఆలయ కమిటీ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించాయి.

ఇక విషయంలోకి వెళ్తే..

మహాశివరాత్రి శుభ సందర్భంగా, ఉత్తరాఖండ్ రాష్ట్రం (Uttarakhand State) ఉఖిమత్‌ (Ukhimath) లోని ఓంకారేశ్వర్ ఆలయంలో (Omkareshwar Temple) పూజలు నిర్వహించిన తర్వాత, కేదార్‌నాథ్ రావల్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించారు. షెడ్యూల్ చేసిన శుభ సమయం ప్రకారం, 2026 ఏప్రిల్ 22న ఉదయం 8:00 గంటలకు ఓంకారేశ్వరుడు కొలువుదీరిన కేదార్‌నాథ్ తలుపులు సాధారణ ప్రజల కోసం తెరవనున్నారు. తేదీ నిర్ధారించిన వెంటనే, అధికారులు, ఆలయ కమిటీ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించాయి. ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు భక్తులు జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవచ్చు. రికార్డు సంఖ్యలో యాత్రికుల సంఖ్య ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా నడక మార్గం, వసతి, వైద్య సౌకర్యాల మరమ్మత్తుల కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.

మోదీకి ఆదరణ..

ప్రధానమంత్రి నరేంద్ర మోద ( PM Narendra Modi) ప్రారంభించిన శీతాకాల యాత్రకు అఖండ స్పందన లభిస్తోంది. జనవరి 31 నాటికి తలుపులు మూసివేసినప్పటి వరకు, 34,140 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. నాలుగు ధామ్‌లలోని ఓంకారేశ్వర్ , పాండుకేశ్వర్ దేవాలయాలు వంటివి శీతాకాల యాత్రా స్థలాలను భక్తులు సందర్శించారు. ఇది ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి కొత్త మైలురాయిగా నిలిచింది. ఇదిలావుంటే, చార్‌ధామ్ కనెక్టివిటీకి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. 125 కి.మీ. రిషికేశ్-కర్ణప్రయాగ్ (Rishikesh-Karnaprayag) రైలు మార్గం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు రైలు మార్గాన్ని విస్తరించడానికి సర్వేలు పూర్తయ్యాయి. మార్చి 2025 నాటికి రూ. 40,384 కోట్లు ఖర్చుతో ఉత్తరాఖండ్‌లో మొత్తం 216 కి.మీ.ల మూడు కొత్త రైలు మార్గాలపై పనులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. బుకింగ్ ఇలా చేసుకోవాలంటే?

చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) రిజిస్ట్రేషన్లు మార్చి 2, 2025 నుంచి ప్రారంభమవుతాయి. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం మీరు ( registrationandtouristcare.uk.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదంటే మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ (ఆండ్రాయిడ్, iOS రెండింటికీ అందుబాటులో ఉంది). మీరు (+91 8394833833) మొబైల్ నంబర్‌లో వాట్సాప్ ద్వారా కూడా మీ బుకింగ్‌లను చేసుకోవచ్చు. వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మీరు “Yatra” అని టైప్ చేయాలి. ఈ చార్ ధామ్ యాత్రకు గౌరీకుంఢ్‌ నుంచి కేదార్‌నాథ్‌ యాత్రకు కాలినడకన భక్తులు వెళ్తుంటారు. కేదార్‌నాథ్‌ యాత్ర దర్శనం తొందరగా జరగాలంటే హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవాలి. కాలినడకన వెళ్తే దాదాపు 16కి.మీ వరకు ప్రయాణించాలి. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. కాలినడక, హెలిక్యాప్టర్ ద్వారా వెళ్లలేనివారికి పల్లకి ద్వారా కూడా దర్శనానికి వెళ్లవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *